బూతు కంటెంట్ సినిమాలకు ఇప్పుడు డిమాండ్ పెరిగిందని చిన్న సినిమా నిర్మాతలు నమ్ముతున్నట్లున్నారు. అదే పనిగా తమ సినిమాల్లో అడల్ట్ కంటెంట్ ని నింపటానికి ప్రయత్నిస్తున్నారు. అది సాధ్యం కాకపోతే డబ్బింగ్ చేసుకుని అయినా బూతుని క్యాష్ చేసుకుందామనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మనకు అడల్ట్ కంటెంట్ సినిమాలు కొత్తేమీ కాదు. కానీ హారర్ లో శృంగారం మిక్స్ చేసిన సినిమాలు మాత్రం కొత్తే. ఈ పాయింట్ మీదే రెడీ అయిన సినిమా ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’.
హార్రర్ అడల్ట్ కామెడీ సినిమాగా బ్లుఘోస్ట్ పిక్చర్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’. సంతోష్ పి. జయకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మిర్చి హేమంత్, ఆదిత్, నిక్కీ టాంబోలి, భాగ్యశ్రీ మోటే, రఘుబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. టైటిల్ తోనే యూత్ ఆడియన్స్‌లో ఊపు తెప్పించిన చిత్రయూనిట్ తాజాగా చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేసి.. షాక్ ఇచ్చింది.
రెండు నిముషాల నిడివితో కూడిన ఈ ట్రైలర్ యూత్ కు కనెక్ట్ అయ్యేలా ఉంది. ట్రైలర్ లోని డైలాగ్స్, సీన్స్ చూసి ఆశ్ఛర్యపోతున్నారంతా. ట్రైలర్ ప్రారంభం లోనే.. ఈ ట్రైలర్ 18 ఏళ్లు నిండిన వారికి మాత్రమే అని ప్రకటించారు.
https://www.youtube.com/watch?v=oc8N2zZ6z0o
హార్రర్ సన్నివేశాలతో తక్కువ, అడల్ట్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉందని స్పష్టమవుతోంది ట్రైలర్ చూస్తుంటే. ట్రైలరే ఇలా ఉందంటే ఇక సినిమా ఎలా ఉండబోతోందా అనే టాక్ మొదలైంది ప్రేక్షుకుల్లో.
‘ఇరుట్టు అరయిల్ మురుట్టు కుత్తు’ అనే సెక్స్-హారర్ తమిళ చిత్రాన్ని తెలుగులో ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ రీమేక్ చేశారు. తమిళనాడులో ఆ చిత్రం అంతగా ఆడలేదు. అయినా దాన్ని రీమేక్ చేశారు. తొలుత ఈ పోస్టర్, టైటిల్ అనౌన్స్ అయినప్పుడు… ఇదో హారర్ థ్రిల్లరరర్ జోనర్‌లో రూపొంది ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ… లేటెస్ట్‌గా విడుదలైన ట్రైలర్ చూడగానే అందరి ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి!
పోసాని కృష్ణ మురళి – రఘుబాబు వంటి సీనియర్ కమెడియన్స్ తో పాటు తాగుబోతు రమేష్ – మిర్చి హేమంత్ వంటి నటులు కూడా సినిమాలో కీలకపాత్రలో నటించటంతో తెలుగు నేటివిటి వచ్చిందని భావిస్తున్నారు.