తెలుగ‌మ్మాయి ఆ బోల్డ్ సీన్‌లో చెల‌రేగిందా?

                                       ఆ టెంప్టింగ్ సీన్ లో గిలిగింత‌లు

బాలీవుడ్ లో సంచ‌ల‌న విజ‌యం సాధించిన ల‌స్ట్ స్టోరీస్ కి తెలుగు వెర్ష‌న్ రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లో తెలుగు వెర్ష‌న్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగుకి రానుంది. ఈ వెర్ష‌న్ లో అమ‌లాపాల్ .. ఇషా రెబ్బా లాంటి నాయిక‌లు స్పెష‌ల్ ట్రీట్ ఇవ్వ‌నున్నారు.

అలాగే ల‌స్ట్ స్టోరీస్ కి నలుగురు ద‌ర్శ‌కులు ప‌ని చేస్తే తెలుగులో కూడా న‌లుగురు డిఫ‌రెంట్ డైరెక్ట‌ర్లు ప‌ని చేస్తున్నారు. అందులో సంక‌ల్ప్ రెడ్డి తెర‌కెక్కిస్తున్న ఒక ఎపిసోడ్ లో ఇషారెబ్బా న‌టిస్తోంది. ఈ తెలుగ‌మ్మాయి ఇందులో కొన్ని ఛాలెంజింగ్ బోల్డ్ సీన్స్ లో న‌టించింద‌ని తెలిసింది. ముఖ్యంగా ఒరిజిన‌ల్ హిందీ వెర్ష‌న్ లో కియ‌రా అద్వాణీ పోషించిన పాత్ర‌ను తెలుగు వెర్ష‌న్ లో ఇషారెబ్బా పోషిస్తోంది. అక్క‌డ వైబ్రేట‌ర్ సీన్ (మాస్ట‌ర్ బేష‌న్) ని తెలుగులోనూ య‌థాత‌థంగా తెర‌కెక్కించార‌ని… ఆ స‌న్నివేశంలో ఇషారెబ్బా పెర్ఫామెన్స్ తెలుగు యువ‌త‌కు గిలిగింత‌లు పెడుతుంద‌ని చెబుతున్నారు. అలాగే పొగ తాగే స‌న్నివేశంలో ఇషా న‌ట‌న‌ కేక‌లు పుట్టిస్తుంద‌ట‌.

ల‌స్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ తో కియరాకి వ‌చ్చినంత గుర్తింపు ఇషారెబ్బాకు వ‌స్తుంద‌ని ఆ త‌ర్వాత ఆ త‌ర‌హా గ్లామ‌ర్ కంటెంట్ ఉన్న సినిమాల్లో ఛాన్సులు ద‌క్కించుకుంటుంద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే ఈ తెలుగ‌మ్మాయి గ్లామర్ షో విష‌యంలో ప‌ట్టు విడుపు ప్ర‌ద‌ర్శిస్తోంది. సోష‌ల్ మీడియాల్లో హీట్ పెంచేస్తోంది. అందువ‌ల్ల ఇషా కి పెద్ద కెరీర్ ఉంద‌న్న ఊహాగానాలు సాగుతున్నాయి. ఇషా ఇప్ప‌టికే ప‌లు క్రేజీ చిత్రాల్లో నాయిక‌గా న‌టిస్తోంది.