ప్రేమతోనే సరి.! పెళ్లికి ఏది దారి.!

తమన్నా, విజయ్ వర్మ గాఢంగా ప్రేమించుకుంటున్నారు.. ఇటీవలే ఈ విషయాన్ని ప్రకటించి తెగ ప్రమోట్ చేసుకుంది తమన్నా.

బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ‘లస్ట్ స్టోరీస్’ అనే వెబ్ సిరీస్‌లో నటించిన తమన్నా.. బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ‌తో లిప్ లాక్ సన్నివేశాలూ, గాఢమైన శృంగార సన్నివేశాల్లో నటించేందుకు తన ఇన్నేళ్ల లిప్ లాక్ షరతును కూడా ఛేదించేసిందన్న విమర్శలు వినిపించాయ్.

అంతా బాగానే వుంది.. బాయ్ ఫ్రెండ్‌తో లిప్ లాక్ చేస్తే తప్పేంటీ.? అంటూ తాను చేసిన పనిని పబ్లిగ్గా సమర్ధించుకున్న తమన్నా.. ఇప్పుడు ఏదో తేడా చేస్తోందనిపిస్తోంది.

పెళ్లి గురించి అడిగితే సింపుల్‌గా పెదవి విరిచేస్తోందట. లవర్‌ని పరిచయం చేశాకా, పెళ్లి వయసు మీద పడ్డాకా.. సహజంగా అడుగుతారు కదా.. పెళ్లెప్పుడని.! కానీ, ఆ మాట వినగానే తమన్నా కస్సుమంటోందట

అంతే కాదు.. విజయ్ వర్మ తనకు మంచి స్నేహితుడు మాత్రమే అని చెబుతోంది.. ఇదంతా చూస్తుంటే, అస్సలు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం తమన్నాకి వుందా.? లేదా.? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్.

అయినా ఇప్పుడిదో కొత్త ట్రెండ్ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్‌ని పరిచయం చేయడం, సహజీవనం చేయడం.. పెళ్లి మాట ఎత్తేసరికి కస్సుమని, ప్లేట్ ఫిరాయించేయడం..! తమన్నా కూడా అదే చేస్తోందా.? ఏమో లెట్స్ వెయిట్ అండ్ సీ.!