తమన్నా పై ఇంత ద్వేషం తగునా??

ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా కూడా ఓ హీరోయిన్ దాదాపు రెండు దశాబ్దాలు పాటుగా ఇండస్ట్రీలో అందులోని ఇప్పుడు టైం లో కొనసాగడం అనేది చాలా కష్టమే అని చెప్పాలి. అయితే ఓ దశాబ్దంన్నర కాలం కితం హీరోయిన్ గా పరిచయం అయ్యి ఇప్పటికీ పలు భాషల్లో సినిమాలు చేస్తున్న కొద్ది మంది హీరోయిన్స్ లో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఒకామె.

అయితే తమన్నా ఓ పెర్ఫార్మర్ గా అలాగే ఓ డాన్సర్ గా కూడా ఎంతో క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఇప్పటికీ కూడా తమన్నా చేతిలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ లాంటి బిగ్ స్టార్స్ భారీ సినిమాలు ఉన్నాయి. కానీ ఆమె లేటెస్ట్ గా చేసిన వెబ్ షోస్ పరంగా అయితే ఇప్పుడు దారుణంగా ట్రీట్ చేయబడుతుంది.

ఆమె చేసిన రీసెంట్ రెండు వెబ్ షో లో జీ కార్డా అలాగే లస్ట్ స్టోరీస్ 2 రెండిట్లో కూడా తమన్నా తన బోల్డ్ విశ్వరూపం చూపించింది. అయితే ఇదే సాకుగా చాలా మంది ఇప్పుడు ఆమెపై మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా అయితే తమన్నా ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని వారే డైరెక్షన్స్ ఇస్తున్నారు.

ఇప్పటివరకు తమన్నా చూడని చెయ్యని రోల్ లేదు. అలాగే ఒక యాక్టర్ గా ఎలాంటి పాత్ర చేయడానికి అయినా అంతా సిద్ధం అయ్యే ఉంటారు. ఇలాంటివి అన్నీ వదిలేసి ఇలాంటి రోల్స్ చేయకూడదు అలాంటి రోల్స్ చేయకూడదు అని నెటిజన్స్ సోషల్ మీడియాలో ఆమెకి హితవు పలుకుతున్నారు.