మందుకొట్టడమేనా..ఇంకేదైనా చేసిందా?


సాధారణంగా నేను మందు కొట్టాను అని ఏ సెలబ్రెటీ బహిరంగంగా చెప్పుకోవటానికి ఇష్టపడరు. కానీ ఇవి పబ్లిసిటీ రోజులు..ఎలా మాట్లాడితే తన గురించి మీడియా మాట్లాడుతుందో ఆలోచించుకుని అలాంటి వివాదాలను జనాల్లోకి వదులతున్నారు సినిమావాళ్లు. తాజాగా “టాక్సీవాలా” హీరోయిన్ ..తను ఏదో గొప్ప విషయం సాధించినట్లు..సెట్లో తాగి నటించా అంటూ ఒకటికి పదిసార్లు ఇంటర్వూలో చెప్తోంది. అంతకు మించి సినిమాలో చెప్పుకోవటానికి ఏమీ లేనట్లుగా..

హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ మాట్లాడుతూ… “ఈ సినిమాలో ఒక సీన్ కోసం చాలా టేక్స్ చేశాను కానీ సీన్ పండడం లేదు. ఆ సీన్ పబ్ లో తాగి క్యాబ్ బుక్ చేసేది. ఏం చేయాలో అర్దం కాలేదు. తాగినట్లుగా నేను చేయలేకపోతున్నా. ఇక వేరే దారిలేక తాగుతానని చెప్పాను. మొదట దర్శక,నిర్మాతలు ఎవరూ ఒప్పుకోలేదు. తర్వాత విషయం అర్దమై వాళ్లే లైట్ గా వోడ్కా ఇచ్చారు. అది తాగిన తర్వాత కాస్త మత్తు అనిపించింది. వెంటనే షాట్ ఓకే అయిపోయింది.” అంటూ చెప్పుకొచ్చింది.

ఇక “టాక్సీవాలా” సినిమా దాదాపు రెండేళ్ల కిందటి నుంచి నడుస్తున్న సినిమా. అప్పట్నుంచి ప్రియాంక వేరే సినిమా ఏదీ కమిటవ్వలేదు . టాక్సీవాలా” రిజల్ట్ చూసే తన తర్వాత సినిమాలు కమిట్ అవుతానని వెయిట్ చేస్తోంది. ఇంకెంత ఇంకొక్క రోజేగా.