ఎవ‌రి రేటు వాళ్ల‌ది.. అంటున్న‌ తాప్సీ

 
పే గ్యాప్ గురించి ఇప్పుడిప్పుడే హీరోయిన్లు నోరు విప్పుతున్నారు. హీరోల‌కు ఒక రేటు.. హీరోయిన్ల‌కు ఒక రేటా? అని ప్ర‌శ్నించ‌డం మొద‌లుపెడుతున్నారు. హీరోల‌ను చూసి థియేట‌ర్ల‌కు ఎంత మంది వ‌స్తారో, అలాగే హీరోయిన్ల‌ను చూడ‌టానికి వ‌చ్చేవారి సంఖ్య కూడా ఉంటుంది. అయినా హీరోల‌కు ఇచ్చే పారితోషికానికి, హీరోయిన్ల‌కు అందే రెమ్యూన‌రేష‌న్‌కు గ్యాప్ బాగా ఉంటోంది. గ‌తేడాది మీటూ ఉద్య‌మంతో పాటు ఈ విష‌యం కూడా కాస్త బాగానే వెలుగులోకి వ‌చ్చింది. తాజాగా ఈ పారితోషికం గురించి తాప్సీ మాట్లాడింది. ఆమె మాట్లాడుతూ “ఏ యాక్ట‌ర్‌కి ఉండాల్సింది ఆ యాక్ట‌ర్‌కి ఉంది. థియేట‌ర్కు ఆడియ‌న్స్ ని మేగ్జిమ‌మ్ పుల్ చేసే ఆర్టిస్టుల‌కు దానికి త‌గ్గ‌ట్టే రెమ్యూన‌రేష‌న్ ఇస్తున్నారు. ఆడ‌వాళ్ల‌కైనా అంతే. మ‌గ‌వాళ్ల‌కైనా అంతే. నేను ఈ విష‌యాన్ని ఈ దృష్టితోనే చూస్తున్నాను. బ్యాంక‌బుల్ స్టార్స్ కి వాళ్ల రేటు వాళ్ల‌కుంది“ అని అన్నారు.