హీరోయిన్ హౌజ్ అరెస్ట్,పోలీస్ కేసు

హీరోయిన్ హౌజ్ అరెస్ట్,పోలీస్ కేసు

మరో రెండు రోజుల్లో తమిళనాట విడుదల కాబోతున్న తమిళ చిత్రం ‘తొరట్టి’. షమన్‌ పిక్చర్స్‌ సంస్థలో వాటాదారుడిగా వున్న పెరుంగొళత్తూర్‌కు చెందిన షమన్‌ మిత్రు నిర్మించిన ‘తొరట్టి’ చిత్రంలో హీరోయిన్‌గా కోయంబత్తూర్‌ జిల్లా పొల్లాచ్చికి చెందిన సత్యకళ నటించింది. ఆగస్టు 2వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ప్రమోషన్‌లో భాగంగా ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో హీరో షమన్‌ మిత్రు సహా యూనిట్‌ సభ్యులందరూ పాల్గొనగా, హీరోయిన్‌ మాత్రం హాజరు కాలేదు. దీంతో హీరోయిన్‌ సత్యకళను ఆమె తండ్రి హౌస్‌ అరెస్టు చేశారని, ఆమెను కోర్టులో హాజరుపరిచేలా పోలీసులకు ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో సదరు చిత్ర నిర్మాత హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ నేపథ్యంలో షమన్‌ మిత్రు మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను మంగళవారం న్యాయమూర్తులు సుందరేష్‌, నిర్మల్‌ కుమార్‌లతో కూడిన బెంచ్‌ విచారణకు స్వీకరించింది. అప్పుడు పిటిషనర్‌ తరపు న్యాయవాది కరుణాకరన్‌ హాజరై వాదించారు. నటి సత్యకళను ఆమె తండ్రి హౌస్‌ అరెస్ట్‌ చేశారని, దీనిపై కోయంబత్తూరు జిల్లా మహాలింగపురం పోలీసులకు ఈ నెల 25వ తేదీన ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలిపారు.

<

p style=”text-align: justify”>చట్టవిరుద్ధంగా నిర్భందించిన సత్యకళను కోర్టులో హాజరుపరచాల్సిందిగా పోలీసులకు ఉత్తర్వులు జారీ చేయాలని న్యాయస్థానాన్ని ఆయన కోరారు. కుటుంబ గొడవల వల్లే ఆమె తండ్రి ఇలా చేసినట్లు తెలుస్తోంది. సత్యకళను హాజరు పరచాలని కోరుతూ ఆమెతో హీరోగా నటించిన షమన్‌ మిత్రు కోర్టులో పిటిషన్‌ ఎలా దాఖలు చేశారని ప్రశ్నించిన న్యాయమూర్తుల బెంచ్‌.. ఈ వ్యవహారంపై పూర్తి నివేదిక సమర్పించాల్సిందిగా మహాలింగపురం పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది.