హీరోయిన్ తమన్నా కెరీర్ ఇప్పుడు ఎటూ పాలుపోలేని పరిస్థితిలో ఉంది. ఓ పక్క వరుసగా ప్లాప్ లు వస్తున్నాయి. ఇటు చూస్తే కుర్ర హీరోయిన్ ల హవా ఎక్కువ అయిపోయి తానూ సీనియర్ అయిపొయింది. ఇక చేసేది లేక సీనియర్ హీరోల సినిమాలనే నమ్ముకున్నట్టు ఉంది ఈ మిల్కీ బ్యూటీ. వివరాల్లోకి వెళ్తే.
ఆమెకు తాజాగా గోపీచంద్ సరసన హీరోయిన్ అవకాశం వచ్చినా ఆమె కాదంది. కారణం, ఇప్పుడే వెంకటేష్, చిరు సరసన చేస్తున్న ఆమె మళ్ళీ మధ్య స్థాయి హీరోలతో చేయకూడదడు అనుకుందట. అందువల్ల డేట్లు లేవు పొమ్మంది. మరో పక్క హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా వచ్చినా కాదంది.
ఒక యాక్షన్ సినిమా వస్తే కాదనుకుని పెద్ద హీరోల సినిమాల్లో అవకాశం కోసం మాత్రమే చూస్తోంది. అవును మరి చేసిన అభినేత్రి వంటి సినిమాలు బెడిసి కొడితే ఇక ప్రయోగాలు ఆపి సేఫ్టీ చూసుకోవడంలో తప్పు లేదు కదూ.