Desamuduru Movie: అల్లుఅర్జున్ దేశముదురు సినిమాని సుమంత్ రిజెక్ట్ చేయడానికి కారణం ఇదేనా?

Desamuduru Movie: అల్లు అర్జున్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దేశముదురు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా హన్సిక సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న హన్సిక ఆ తర్వాత ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగారు. ఇక అల్లు అర్జున్ వంటి హీరోకి దేశముదురు బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో ఈయన ఇండస్ట్రీలో అద్భుతమైన అవకాశాలను అందుకుంటున్నారు.

అయితే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరక్కేకిన దేశముదురు సినిమా ముందుగా అల్లు అర్జున్ కాకుండా ఈ సినిమా హీరో సుమంత్ చేయాల్సి ఉందని తాజాగా సుమంత్ తెలియజేశారు.దేశముదురు సినిమాతో పూరి జగన్నాథ్ ముందుగా హీరో సుమంత్ ని కలిశారని అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమాని చేసారని వార్తలు వచ్చాయి.అయితే ఈ సినిమా ఎందుకు రిజెక్ట్ చేయాల్సి వచ్చిందో సుమంత్ తాజాగా మళ్ళీ మొదలైంది సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.

ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ దేశముదురు సినిమా నేను రిజెక్ట్ చేయడానికి గల కారణం అప్పటికి నేను వేరే సినిమాతో బిజీగా ఉండటం వల్ల డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ సినిమాని వదులుకున్నాను. అంతే కాకుండా ఈ సినిమా కథ వినగానే ఈ సినిమాకు నేను సెట్ అవ్వనని ఆ రోజే తేల్చి చెప్పాను.ఈ సినిమా కనుక నాతో చేసి ఉంటే తప్పకుండా ఈ సినిమా ఇంతటి విజయాన్ని అందుకునేది కాదని తను ఏమాత్రం ఈ సినిమాకి సెట్ కాననీ, అందుకే ఆ సినిమాని వదులుకున్నానని ఈ సందర్భంగా సుమంత్ దేశముదురు సినిమా చేయకపోవడానికి కారణం తెలియజేశారు.