హీరోకి జ్ఞానోదయం..  బడ్జెట్ కూడా తగ్గింది !    

ఓటమి వల్ల చాల కోల్పోతాం గాని,  నిజానికి ఆ ఓటమే  మనకు చాల నేర్పిస్తోంది అంటున్నాడు  యాక్షన్ హీరో గోపీచంద్‌. అంతేలే వరుస డిజాస్టర్లు వచ్చినప్పుడు ఆ ప్లాప్ ల నుండే  చాల నేర్చుకోవచ్చు.  ఏది ఏమైనా  గోపీచంద్‌ లో మార్పు వచ్చిందట. మార్పు అంటే  గెటప్ లో సెటప్ లో కాదు,  మైండ్ సెట్ లో. యాక్షన్ తప్ప తనకు ఏది సెట్ అవ్వదని బలంగా నమ్మే ఈ మాస్ హీరోలో   ఇప్పుడు యాక్షన్ అంటేనే  ఓవర్ గా వద్దు అంటున్నాడు. ఇంతకీ అసలు విషయంలోకి వెళ్తే..  గోపీచంద్‌ హీరోగా  తమన్నా హీరోయిన్ గా   సంపత్‌ నంది డైరెక్షన్ లో  స్పోర్ట్స్‌ బేస్డ్‌ సినిమా  ‘సిటీమార్’ రానుంది. ఈ సినిమాలో  గోపీచంద్  ఆంధ్రాకి లీడ్‌ చేసే ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తున్నాడు. మరి కోచ్ గా గోపీచంద్ బాగనే కష్టపడుతున్నాడు . 

ఇక మిల్క్ బ్యూటీ తమన్నా తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌గా  చేస్తోంది. అయితే బలమైన యాక్షన్ సీక్వెన్స్ తో   సాగే  ఈ చిత్రంలో కొన్ని   ఓవర్  యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయని,  ఆ యాక్షన్ సీక్వెన్స్ ను తగ్గించమని.. అలాగే  మూవీలో  పక్కా కామెడీ సీక్వెన్సెస్  హైలెట్ అయ్యే విధంగా మూవీని ప్లాన్ చేయమని.. అలాగే బడ్జెట్ ను తగ్గిస్తే మంచిదని గోపీచంద్  సంపంత్ నందికి చెప్పడంతో, సంపత్ ఈ లాక్ డౌన్ ఖాళిలో స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేశాడట. అయినా సినిమాకి ఓవర్ బడ్జెట్ పెట్టి  అది  రాబట్టలేక ఫైనల్ గా ప్లాప్ అనిపించుకోవడం ఎందుకు..? సాధ్యం అయినంతవరకు బడ్జెట్ తగ్గించకుని.. ఆ కొద్దిగా రాబట్టుకుని హిట్ అనిపించుకోవడం బెస్ట్.  

ఇక సంపత్ నంది కూడా బడ్జెట్ తగ్గించడానికి స్క్రిప్ట్ లో చేసిన మార్పులు గోపీచంద్ కి కూడా బాగా నచ్చాయట. పైగా కామెడీ కోసం గోపీచంద్ పాత్రను  చాలా వైవిధ్యంగా మలిచారని…   సినిమా మొత్తం మీద గోపిచంద్  పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయట. కాకపోతే అలాంటి పాత్రలో గోపీచంద్ ఎలా నటిస్తాడు అన్నదే డౌట్.  బట్,  పాత్రలోని  వేరియేషన్స్ కారణంగానే మూవీలో  కామెడీకి మంచి స్కోప్ ఉందని.. సినిమా హిట్ గ్యారింటీ అని అంటున్నారు. అయితే గోపీచంద్ – సంపత్ నంది   కాంబినేషన్ లో  వచ్చిన గౌతమ్ నంద పెద్ద ప్లాప్.. ఆ ప్లాప్ మర్చిపోయే రేంజ్ లో హిట్ కోడిట్ తప్పితే  ఈ సినిమా వర్కౌట్ అవ్వదు.