వయసు పెరిగినా తమన్నా క్రేజ్ తగ్గట్లేదు.. 2 కోట్లట !

Tamannaah charges bomb for OTT 11th Hour

Tamannaah charges bomb for OTT 11th Hour

టాలీవుడ్ హీరోయిన్లలో సుదీర్ఘమైన కెరీర్ కొనసాగించిన హీరోయిన్లలో తమన్నా ఒకరు. 2005లో ‘శ్రీ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె ఇప్పటికీ స్టార్ హీరోయిన్ల జాబితాలో కొనసాగుతోనే ఉంది. ఇండస్ట్రీలో ఉన్న దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ సినిమాలు చేసింది తమన్నా. ఇప్పటికీ ఆమె చేతిలో నిండుగా ఆఫర్లు ఉన్నాయి. ‘సీటిమార్, మాస్ట్రో, ఎఫ్ 3, గుర్తుందా శీతాకాలం’ లాంటి సినిమాలో నటిస్తోంది ఈ మిల్కీ బ్యూటీ. దర్శక నిర్మాతలు కూడ తమన్నా పట్ల ఇంకా ఆసక్తిగానే ఉన్నారు. మాస్ జనాల్లో ఆమెకున్న ఫాలోయింగే ఇందుకు కారణం.

ప్రస్తుతం తమన్నా ఓటీటీ ప్రాజెక్ట్స్ కూడ చేస్తోంది. ప్రజెంట్ ఆమె ఆహా ఓటీటీలో ‘లెవంత్ హవర్’ చేస్తోంది. ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో తమన్నా కార్పొరేట్ బాస్ పాత్రను చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఆమె ఏకంగా రూ.2 కోట్లు పారితోషకం పుచ్చుకుందట. నిర్మాతలు సైతం అడ్డు చెప్పకుండా తమన్నా అడిగినంత ఇచ్చేశారట. ఓటీటీలోనే తమన్నా ఈ స్థాయి రెమ్యునరేషన్ తీసుకుంటోంది అంటే ఇక సినిమాల్లో కూడ కోటి కోటిన్నర వరకు ఛార్జ్ చేస్తుందనే అనుకోవాలి. మొత్తానికి వన్నె తగ్గకుండా బ్యూటీని మైంటైన్ చేస్తూ బొంబాయ్ బ్యూటీ గట్టిగానే సంపాదిస్తోంది.