సైరాను పంచుకున్న అమెజాన్, జెమినీ

సైరా బిజినెస్ అస‌లు నిజాలు ఇవీ

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన భారీ పాన్ ఇండియా చిత్రం `సైరా: న‌ర‌సింహారెడ్డి`. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడు. రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని 270 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమా అక్టోబ‌ర్ 2న‌ రిలీజ‌వుతోంది. తాజాగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని జెమినికి 25కోట్ల‌కు క‌ట్ట‌బెట్టారని తెలుస్తోంది. ఆ సంగ‌తిని జెమిని చానెల్ ప్ర‌తినిధులు అధికారికంగా ధృవీక‌రించారు.
 
తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం వ‌ర‌కూ రైట్స్ జెమినికి చేజిక్కాయి. ఇందు కోసం 25కోట్లు జెమిని చెల్లిస్తోంది. అలాగే అమెజాన్ ప్రైమ్ వాళ్ల‌కు 50కోట్ల‌కు గంప‌గుత్త‌గా డిజిట‌ల్ రైట్స్ ను విక్ర‌యించారు. ఒకేసారి శాటిలైట్, డిజిట‌ల్ క‌లిపి స‌న్ నెట్ వ‌ర్క్ వాళ్ల‌కు 125 కోట్ల‌కు అమ్మేశార‌ని ఇదివ‌ర‌కూ ప్ర‌చార‌మైంది. కానీ అది నిజం కాద‌ని తాజా వివ‌రాల్ని బ‌ట్టి వెల్ల‌డైంది. 

కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ అక్క‌డ సొంత రిలీజ్

అలాగే సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రానికి 200 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ సాగించార‌న్న వార్త‌ల్లోనూ ఎలాంటి నిజం లేదు. ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ తెలుగు రాష్ట్రాలు స‌హా క‌ర్నాట‌క ఓవ‌ర్సీస్ లో 150 కోట్ల మేర పూర్తి చేసింది కొణిదెల బృందం. త‌మిళ‌నాడు, హిందీ బెల్టులో సొంతంగానే కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ రిలీజ్ చేస్తోంది.