సైరా వాయిదా లేదు- రామ్‌చ‌ర‌ణ్

సైరాకే ఎందుకిలా జ‌రుగుతోంది?

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం `సైరా: న‌ర‌సింహారెడ్డి`. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ ప‌తాకంపై రామ్ చ‌ర‌ణ్ నిర్మించారు. దాదాపు 200 కోట్ల బ‌డ్జెట్ తో ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే త‌ల‌మానికం అన‌ద‌గ్గ రీతిలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇటీవ‌లే రిలీజైన మేకింగ్ వీడియో, టీజ‌ర్ ఫ్యాన్స్ స‌హా కామ‌న్ ఆడియెన్ లోకి దూసుకెళ్లాయి. ట్రాయ్, గ్లాడియేట‌ర్ రేంజులో సూరి-చెర్రీ బృందం చేస్తున్న ఈ ప్ర‌య‌త్నంపై ప్ర‌శంస‌లు కురిశాయి. సాహో త‌ర్వాత‌ భారీ వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ తో రాబోతున్న అసాధార‌ణ చిత్ర‌మిద‌ని అర్థ‌మైంది.

ఆ ప్ర‌చారంలో నిజం లేదు.. రూమ‌ర్ మాత్ర‌మే

ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో ఫ‌ర్హాన్ అక్త‌ర్- ర‌వీనా టాండ‌న్ బృందం రిలీజ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సాహో రైట్స్ కి ధీటుగా సైరా హిందీ రైట్స్ కి చెల్లించార‌ని ప్ర‌చార‌మైంది. `సాహో` త‌ర‌హాలోనే ప్ర‌చారం చేసి అత్యంత భారీగా రిలీజ్ చేయాల‌న్న‌ది చ‌ర‌ణ్ టీమ్ ప్లాన్. అయితే ఈలోగానే అక్టోబ‌ర్ 2న ఈ సినిమా రిలీజ్ కాద‌ని ప్ర‌చార‌మైంది. అదే రోజు హృతిక్, టైగ‌ర్ ష్రాఫ్ న‌టించిన భారీ యాక్ష‌న్ చిత్రం `వార్` రిలీజ‌వుతోంది. థియేట‌ర్ల స‌మ‌స్య‌తో సైరాను వారం పాటు వాయిదా వేశారు అంటూ ప్ర‌చార‌మైంది. అయితే ఇది నిజ‌మా? అని రామ్ చ‌ర‌ణ్ ని `వీ-ఎపిక్` థియేట‌ర్ లాంచ్ వేడుక‌లో జ‌ర్న‌లిస్టులు ప్ర‌శ్నించారు. దానికి స్పందించిన చ‌ర‌ణ్ ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేద‌ని చెప్పిన టైముకే అక్టోబ‌ర్ 2న గాంధీ జ‌యంతి కానుక‌గా సైరా చిత్రాన్ని రిలీజ్ చేసి తీర‌తామ‌ని ప్ర‌క‌టించారు. దీంతో సైరా రిలీజ్ పై పూర్తిగా క్లారిటీ వ‌చ్చేసిన‌ట్టే.