తెలుగు రాష్ట్రాలపైనే మెగా ఆశ
మెగాస్టార్ చిరంజీవి నటించిన `సైరా: నరసింహారెడ్డి` గాంధీ జయంతి కానుకగా రిలీజైన సంగతి తెలిసిందే. అక్టోబర్ 2 న రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్స్ తో మొదలైన ఈ చిత్రం .. తొలి వీకెండ్ ఆశించిన పురోగతిని సాధించలేదు. నాన్ హాలీడేస్ కొన్నిచోట్ల కలెక్షన్లకు ఇబ్బందికరంగా మారిందన్నది ట్రేడ్ విశ్లేషణ. అలాగే అమెరికా సహా తమిళనాడులోనూ ఆశించిన వసూళ్లు దక్కలేదు. కర్నాటక మంచి వసూళ్లు తెచ్చినా మలయాళం వీక్ కలెక్షన్స్ తో నిరాశ ఎదురైంది. ఇక ఉత్తరాదిన ఏమాత్రం ప్రభావం చూపించకపోవడం అతి పెద్ద డిసప్పాయింట్ మెంట్.
లేటెస్ట్ సమాచారం ప్రకారం.. తెలుగు రాష్ట్రాల నుంచి 5 రోజుల్లో 72.15కోట్ల మేర షేర్ కలెక్ట్ చేసింది. 5డే షేర్ వసూళ్లను పరిశీలిస్తే.. వైజాగ్ -9.98 కోట్లు (1.38 కోట్లు), తూ.గో జిల్లా-7.39 కోట్లు (55 లక్షలు), ప.గో జిల్లా- 5.26కోట్లు (37లక్షలు), కృష్ణ- 5.39 కోట్లు (71లక్షలు), గుంటూరు -7.38కోట్లు (73లక్షలు), నెల్లూరు-3.19కోట్లు (30లక్షలు), సీడెడ్-12.61కోట్లు (1.80కోట్లు), నైజాం-20.95కోట్లు (3.30కోట్లు) కలెక్టయ్యింది. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల దూకుడు కొనసాగుతోంది. దసరా సెలవులు పెద్ద ప్లస్ అవుతోంది. అయితే ఇతర మార్కెట్లు సైరా ఆశల్ని పెద్ద దెబ్బ కొట్టాయని ట్రేడ్ చెబోతోంది. మరోవైపు సైరా రిలీజైన మూడు రోజులకు వచ్చిన గోపిచంద్ `చాణక్య` నెగెటివ్ టాక్ వల్ల ఆశించిన వసూళ్లను సాధించలేకపోయింది. గోపిచంద్ కెరీర్ లో మరో యావరేజ్ చిత్రంగా నిలవనుందని తెలుస్తోంది.