ఏపీ ప్రభుత్వానికి శుభవార్త చెప్పిన కేంద్రం !

Can Jagan Stop Justice NV Ramana Now

ఏపీ సర్కారుకు కేంద్ర ప్రభుత్వం మంచి గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో రెండేళ్ల క్రితం వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత గత టీడీపీ హయాంలో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చింది. వీటిని సమీక్షించేందుకు దూకుడుగా ఏపీ ప్రభుత్వం ముందుకు సాగింది. అయితే హైకోర్టుతో పాటు కేంద్ర ప్రభుత్వం బ్రేకులు వేయడంతో ఆ వ్యవహారం ఇక తెరమరుగు అయ్యింది. ఇన్నాళ్లకు మళ్లీ కేంద్రం విద్యుత్ ఒప్పందాలపై జగన్ సర్కారుకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రస్తుతం సహజసిద్ధంగా లభించే జల విద్యుత్ కన్నా సంప్రదాయేతర సౌర విద్యుత్‌, పవన విద్యుత్‌కు డిమాండ్‌ పెరుగుతోంది.

AP CM Jagan is taking a crucial step in soon
AP CM Jagan

జల విద్యుత్‌ ఉత్పత్తిలో ఉన్న ఇబ్బందు దృష్ట్యా దీని కన్నా చౌకగా లభించే సంప్రదాయేతర విద్యుత్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎదురుచూస్తున్నాయి. ఇదే క్రమంలో సోలాల్‌, విండ్‌ ఎనర్జీ ఉత్పత్తి కోసం పలు జాతీయ, అంతర్జాతీయ సంస్ధలు తెరపైకి వచ్చాయి. ఆరంభ దశలో వీటితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఎత్తున ఒప్పందాలు చేసేసుకున్నాయి. తొలుత దాదాపు జల విద్యుత్‌తో సమానంగా ఉన్న వీటి ధరలు ఆ తర్వాత ఉత్పత్తి పెరిగాక బాగా తగ్గిపోయాయి. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకున్న దీర్ఘకాలిక ఒప్పందాల వల్ల అప్పుడు ఒప్పుకున్న ధరలు ఇప్పటికీ చెల్లించాల్సి వస్తోంది.

ప్రస్తుతం మార్కెట్లో యూనిట్‌ మూడు, నాలుగు రూపాయలకు దొరుకుతున్న సోలాల్‌, విండ్‌ పవర్‌ను విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్న సంస్ధలకు మాత్రం పాత ఒప్పందాల ప్రకారం 11 రూపాయల చొప్పున చెల్లించాల్సి వస్తుంది. ఒక్క ఏపీలోనే ఈ ఒప్పందాల విలువ రూ.25 వేల కోట్లు అంటే ఆశ్చర్యపోవాల్సిందే. దీంతో వైసీపీ అధికారంలోకి రాగానే సీఎం జగన్‌ ఈ ఒప్పందాలను సమీక్షించేందుకు సిద్ధమయ్యారు. ఎప్పుడైతే రాష్ట్రానికి గుదిబండగా మారిన పీపీఏలపై సీఎం జగన్‌ సమీక్షకు సిద్ధమయ్యారో అప్పుడే దేశవ్యాప్తంగా దీనిపై చర్చ మొదలైంది.

కేంద్రం ఏదైతే వద్దని కోరుకుందో అదే చర్చ సాగింది. దీంతో జగన్‌ తీరుపై కేంద్రం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్‌ అభ్యంతరాలనే మిగతా రాష్ట్రాలు కూడా లేవనెత్తాయి. దీంతో కేంద్రం వెనక్కి తగ్గక తప్పలేదు. ఇప్పుడు గడువు తీరిన పీపీఏలను కొనసాగించే విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది. కేంద్ర ప్రభుత్వ సంస్ధ సీజీఎస్‌తో రాష్ట్రాల్లోని విద్యుత్‌ పంపిణీ సంస్ధలు (డిస్కంలు) ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాల గడువు ముగిసిపోయాక వాటిని ఉపసంహరించుకునేందుకు కేంద్రం కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది.