టీజ‌ర్ టాక్:  పైలెట్ ఇంటెన్స్ లైఫ్ స్టోరి ఇంట్రెస్టింగ్

19 ఏళ్ల యువ‌కుడిలా 40 ఏజ్ హీరో.. ఇదెలా సాధ్యం?

ఇంటెన్స్ పాత్ర‌ల్లో న‌టించాలంటే సూర్య త‌ర్వాత‌నే. ఎమోష‌న్ ని ప‌ర్ఫెక్ట్ గా డ్రాగ్ చేయ‌డంలో అత‌డి న‌ట‌న ఎంత వండ‌ర్ ఫుల్ గా ఉంటుందో గ‌జినీ-ఇద్ద‌రు- వంటి చిత్రాల్లో చూశాం. లేటెస్టుగా సూర్య న‌టిస్తున్న బ‌యోపిక్ మూవీ `ఆకాశం నీ హద్దురా`. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ మరియు పైలట్ జి ఆర్ గోపినాధ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. `గురు` ఫేం లేడీ డైరెక్టర్ సుధా కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా టీజ‌ర్ రిలీజైంది.

టీజర్ ఆద్యంతం ఎమోషన్ ఆక‌ట్టుకుంది. ఒక స్ఫూర్తివంత‌మైన జీవిత‌ ప్ర‌యాణానికి సంబంధించిన చిత్ర‌మిది. గొప్ప ప్రేరణ కలిగించే అంశం ఉండటంతో ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సూర్య నటనతో పాటు మోహన్ బాబు వాయిస్ ఓవర్ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. క‌లెక్ష‌న్ కింగ్ మోహన్ బాబు ఇందులో ఓ కీలకపాత్ర లో న‌టిస్తుండ‌డం ఆస‌క్తిక‌రం.. అపర్ణ బాలమురళి సూర్యకి జంటగా నటిస్తుండగా, జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. సూర్య కొన్ని వ‌రుస వైఫ‌ల్యాల త‌ర్వాత ఎన్నో హోప్స్ పెట్టుకున్న చిత్ర‌మిది. ఎలాంటి ఫ‌లితాన్ని ఇస్తుందో చూడాలి.