Krithi Shetty: తెలుగు నాట ఉప్పెన అనే తొలి సినిమాతోనే అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన బ్యూటీఫుల్ స్టార్ హీరోయిన్ కృతి శెట్టి. అనతి కాలంలోనే స్టార్ డం స్థాయి హోదాను దక్కించుకొని, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. కర్ణాటకలోని మంగళూర్ నుంచి వచ్చిన ఈ భామ, చిన్నవయసులో చదువుకుంటూనే పలు యాడ్స్ లలో నటించి, అప్పుడే నటన వైపు మెల్ల మెల్లగా అడుగులు వేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక తన తల్లి ప్రోత్సాహంతో మోడలింగ్ లోకి ప్రవేశించింది. ఆ తర్వాత 2019లో హృతిక్ రోషన్ హీరోగా నటించిన సూపర్ 30 లో ఓ చిన్న క్యారెక్టర్ చేసి, సినీ రంగ ప్రవేశం చేసింది కృతి. అదే ఉత్సాహంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో కలిసి ఉప్పెన సినిమాలో నటించి, భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది కృతి శెట్టి.
ఇకపోతే మొదటి సినిమా మంచి విజయం సాధించి పెట్టడంతో, తదుపరి ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్టిన కృతి శెట్టి, ఆ తర్వాత కూడా అగ్ర హీరోల సరసన నటిస్తూ తన ఇమేజ్ ను మరింత పెంచుకుంటూ వస్తోంది. కాగా అవి కూడా సక్సెస్ కావడంతో కృతికి తెలుగు సినీ పరిశ్రమలో డిమాండ్ భారీ స్థాయిలో పెరిగిపోయిందని చెప్పవచ్చు. దాన్ని ఆసరాగా చేసుకొని ఈ బ్యూటీ తన రెమ్యునరేషన్ ను కూడా భారీగా పెంచేసినట్టు తెలుస్తోంది.
ఇక వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం హీరోయిన్స్ తమ డిమాండ్ కి తగ్గట్టుగా బాలీవుడ్ కథా నాయికలతో సమంగా పారితోషికాన్ని పెంచి, తమ పాపులారిటీని రోజు రోజుకీ పెంచుకుంటూ వస్తున్నారు. ఐతే తాజాగా కృతి శెట్టి కూడా అదే బాటలో నడుస్తున్నట్టు తెలుస్తోంది. బాల దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా తెరకెక్కుతున్న ఓ చిత్రంలో ఈమె హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే. ఐతే ఈ సినిమాకు గానూ ఆమె దాదాపుగా రూ 1.5కోట్ల రెమ్యునరేషన్ ను డిమాండ్ చేసినట్టు సినీ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఐతే మొన్నటి వరకు రూ.1 కోటి పారితోషికం తీసుకునే ఈ భామ, సడెన్ గా తన వాల్యూ ను మరింత పెంచేసింది. ఇక ఆమెకున్న మార్కెట్ దృష్ట్యా, నిర్మాతలు సైతం ఎంతైనా ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని టాక్. ఇక వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ కర్ణాటక బ్యూటీ హీరో రామ్ తో కలిసి ది వారియర్, సుధీర్ బాబుతో కలిసి ఆ అమ్మాయి ఎవరో మీకు చెప్పాలి, నితిన్ తో మాచర్ల అనే సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.