యాక్షన్ కి కేరాఫ్ అడ్రెస్.. కానీ ఈ సారి కాదు !    

19 ఏళ్ల యువ‌కుడిలా 40 ఏజ్ హీరో.. ఇదెలా సాధ్యం?

తమిళ్ స్టార్ హీరో సూర్య తన తర్వాతి సినిమాని యాక్షన్ డైరెక్టర్ హరితో ఫైనల్ చేసుకున్నాడు. నిజానికి సూర్య ముందుగా డైరెక్టర్ శివతో సినిమా చేయాల్సి ఉంది. కానీ శివ రజనీకాంత్ ప్రాజెక్ట్ తో బిజీగా ఉండటం.. మధ్యలో కరోనా రావడంతో ఇక హరితో సినిమాకు రెడీ అయ్యాడు సూర్య. వీరి కాంబినేషన్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ‘సింగం’ ప్రాంఛైజీలోని యాక్షన్ సినిమాలే. యాక్షన్ కి కేరాఫ్ అడ్రెస్ లా మారిపోయిన వీరి కాంబినేషన్ అంటేనే కోలీవుడ్ లో మాస్ ప్రేక్షకులకు ఫుల్ క్రేజ్. అయితే ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తోనట్లు ఈ సారి కూడా వీరిద్దరూ పోలీస్ స్టోరీతోనే సినిమా చేస్తారనుకుంటే అలా చేయట్లేదట.

ఇప్పటికే ‘సింగం’ సిరీస్ నందు మూడు చిత్రాలు చేసి ఉండటంతో ఈ సారి కొత్త తరహా కథను చూజ్ చేసుకున్నారని తెలుస్తోంది. పక్కా మాస్ స్క్రిప్ట్ అయిన ‘సింగం’ సినిమాల తరహాలో పోలీస్ కథలా కాకుండా.. కాస్త ఎమోషనల్ గా సాగే ఫ్యామిలీ డ్రామాని ప్లాన్ చేస్తున్నారట. అయితే సూర్య ఫ్యాన్స్ మాత్రం గతంలో వీళ్లు చేసిన ‘ఆరు, వేల్’ లాంటి డిఫరెంట్ మూవీ ఏదైనా చేస్తే బాగుంటుందని ఆశ పడుతున్నారు. మరి ఆరవసారి కలిసి పనిచేస్తున్న ఈ క్రేజీ యాక్షన్ కాంబినేషన్ ఎలాంటి సినిమాను అందిస్తారో చూడాలి. బట్ ఏ సినిమా చేసినా హరి బేసిక్ ఎమోషన్స్ ను పట్టుకోవడంలో ఎక్స్ పర్ట్.

ఇక సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్స్ చాల మందే ఉన్నా, ప్రతి సినిమాలో కొత్తగా ట్రై చేస్తూ.. వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులకు డిఫరెంట్ చిత్రాలను అందిస్తున్న హీరోల్లో సూర్యనే టాప్ ప్లేస్ లో ఉంటాడు. అందుకే హీరో సూర్య ఖాతాలో ‘సింగం’ వంటి యాక్షన్ ఎంటర్ టైనర్ లతో పాటు ‘గజినీ’, ‘సెవెన్త్ సెన్స్’ వంటి ఓ కొత్తరకం సినిమాలు ఉన్నాయి. అదే విధంగా ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ వంటి డిఫరెంట్ లవ్ స్టోరీలతో పాటు రక్తచరిత్ర 2, ఆకాశమే హద్దుగా లాంటి బయోపిక్స్ కూడా సూర్య ఖాతాలో ఉండటం విశేషం. కానీ ప్రతి సినిమాను ఓ ఛాలెంజింగ్ గా తీసుకుని సినిమాలు చేసే ఈ స్టార్ హీరోకి ఈ మధ్య బాక్సాఫీస్ వద్ద వరుస డిజాస్టర్లే పలకరిస్తున్నాయి.