నటి సురేఖా వాణి భర్త మృతి!

క్యారక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఓ స్టైల్ ని క్రియేట్ చేసుకుని త‌ల్లి పాత్ర‌లు, వ‌దిన పాత్ర‌ల‌తో బాగా పాపుల‌ర్ అయిన న‌టి సురేఖ‌వాణి. ఆమె భ‌ర్త సూర్య తేజ అనారోగ్యంతో క‌న్నుమూశారు. సూర్య‌తేజ కొంత‌కాలంగా క్యాన్స‌ర్ వ్యాధితో పోరాడుతున్నారు. చివరకి హాస్పటిల్ లోనే చికిత్స తీసుకుంటూ అంతిమ శ్వాస విడిచారు.

సురేష్, సురేఖాలది ప్రేమ వివాహం. సురేఖా టీవీ యాంకర్ గా ఉన్న సమయంలోనే ఇద్దరూ ప్రేమించి.. పెళ్లి చేసుకున్నారు. సురేష్ తేజ పలు టీవీ షోలకు దర్శకత్వం వహించారు. ఆయన డైరెక్ట్ చేసిన మాటాకీస్, హార్ట్ బీట్, మొగుడ్స్ పెళ్లామ్స్ లాంటి షోలకు సురేఖా వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

పలు సినిమాలలో, టీవీ షోలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆమె … భర్త , కూతురుతో కలిసి హైదరాబాద్ లో జీవిస్తున్నారు. భర్త అనారోగ్యంతో ఆమె గత కొంతకాలంగా సినిమాలు తగ్గించారు.