కూతురి బర్త్ డే వేడుకలు.. హాట్ లుక్‌లో అదరగొట్టిన సురేఖా వాణి

Surekha Vani On Supritha Birthday

క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సురేఖ కామెడీ పాత్రలకు పెట్టింది పేరు. మరీ ముఖ్యంగా శ్రీను వైట్ల చిత్రంలో సురేఖా వాణి నవ్వుల పూలు పూయిస్తూ ఉంటుంది. కమెడియన్‌గానే కాకుండా, ఎమోషనల్ పాత్రల్లోనూ నటించి ఏడిపించ గల సత్తా ఉన్న నటి. అయితే ఈ మధ్య కాస్త అవకాశాలు తగ్గినట్టు కనిపించినా.. సురేఖ పాపులార్టీ ఏ మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో కూతురితో కలిసి నానా రచ్చ చేస్తూ ఉంటుంది.

Surekha Vani Hot Look Supritha Birthday

టీనేజ్ కూతురు ఉన్నా గానీ సురేఖా వాణి అందంలో మాత్రం ఇంకా యవ్వనంగానే ఉంది. అందంలో కూతరి కంటే మిన్నంగా ఉందనే కామెంట్స్ వినిపిస్తుంటాయి. ఇక టిక్ టాక్ వీడియోల్లో సురేఖ, తన కూతురు ఎంతలా కాళ్లు కదుపుతు స్టెప్పులు వేస్తారో అందరికీ తెలిసిందే. అయితే వీటిలో సురేఖా వాణికే ఎక్కువ మార్కులు పడుతుంటాయి. తల్లీ కూతుళ్లిద్దరూ ఫ్రెండ్స్‌లా వెకేషన్స్‌కు వెళ్తుంటారు. సురేఖ తన భర్త చనిపోయాక కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నా గానీ.. ప్రస్తుతం మాత్రం దుమ్ములేపుతోంది.

నేడు సుప్రిత బర్త్ డే. ఈ సందర్భంగా కూతురిని సర్ ప్రైజ్ చేసింది. ఇళ్లంతా అలకరించింది. ఓ కుక్క పిల్లను కూడా గిఫ్‌గా ఇచ్చినట్టు తెలుస్తోంది. ‘నా చిన్ని యువరాణికి హ్యాపీ బర్త్ డే. నువ్వే నా బలం, బలహీనత. నిన్ను, నీ వ్యక్తిత్వాన్ని ప్రతీ ఒక్కరూ ఇష్టపడతారు. నువ్ నీలాగే ఉండు. మీ డాడీ అక్కడి నుంచి చూస్తుంటాడు.. నీ వెంటే ఉంటాడు. నా సర్వస్వం నువ్వే. గాడ్ బ్లెస్ యూ సుప్రిత లవ్లీ గాడు.. ఐ లవ్ యూ.. ఎంజాయ్ చేయ్ కన్నా’ అంటూ కూతుర్ని ప్రేమగా ముద్దుపెడుతున్న ఫోటోను షేర్ చేసింది. ఇక ఈ ఫోటోలో సురేఖా వాణి డ్రెస్ చూస్తుంటే ఎంత హాటో ఇట్టే అర్థమవుతోంది. రోజురోజుకీ సురేఖకు వయసు తగ్గుతున్నట్టే కనిపిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు.