Surekha Vani: సురేఖ వాణి పరిచయం అవసరం లేని పేరు. ఈమె తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇలా నటిగా వరుస సినిమాలలో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్న ఈమె ఇటీవల కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఇక సినిమాలకు దూరమైన సురేఖ వాణి సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇక సురేఖ వాణి తన కూతురు సుప్రీతతో కలిసి చేసే హంగామా మామూలగా ఉండదు. నిత్యం తల్లి కూతుర్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటారు. తాజాగా సురేఖవాణి తన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేసారు ఈ వీడియోలో భాగంగా ఈమె చేతిపై టాటూ వేయించుకున్నారని స్పష్టమవుతుంది అయితే ఈమె వేయించుకున్న టాటూ మరెవరిదో కాదండి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నామాలతో పాటు స్వామి వారి పాదాలు చేతిపైన టాటూ వేయించుకున్నారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన కొంతమంది నెటిజన్లు వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. కొంతమంది చాలా బాగుంది టాటూ అంటూ కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం చేతి పైన వెంకటేశ్వర స్వామి నామాలు, పాదాలు మాత్రమే ఉన్నాయి కానీ మీలో భక్తి లేదు అంటూ కామెంట్ లు చేస్తున్నారు. ఇక సురేఖ వాణి వెంకటేశ్వర స్వామి భక్తురాలు అనే విషయం మనకు తెలిసిందే. ఈమె గతంలో స్వామివారి ఆలయానికి వెళ్లి స్వామివారికి ఏకంగా తలనీలాలు కూడా సమర్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ టాటూ పై నెటిజన్స్ మాత్రం విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.