ఈ మధ్యకాలంలో సాయి ధరమ్ తేజకు హిట్ అనే పదం దూరమైపోయింది. కెరీర్ ప్రారంభంలో ఎంత స్పీడుగా దూసుకుని వచ్చాడో…అంత స్పీడుగా వెనకబడ్డాడు. కేవలం కమర్షియల్ సినిమాలు,మాస్ సినిమా లు చేయాలనే తపనతో చేసిన అర్దం,పర్దం లేని సినిమాలు దెబ్బకొట్టాయి. నిజానికి సాయి ధరమ్ తేజ టాలెంట్ పరంగా ఓ స్దాయి ఉన్నవాడే. తన డాన్స్ లు, డైలాగు డెలవరీ, బాడీ లాంగ్వేజ్ తో ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకున్నాడు.
అయితే రొటీన్ కథలే అతన్ని వెనక్కి నెట్టేసాయి. ఇక అసలు విషయానికి వస్తే తాజాగా అతను ఓ లెటర్ ని తన ఫ్యాన్స్ ని ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఆ ఉత్తరంలో తన కెరీర్, వైఫల్యాలు గురించి ప్రస్తావిస్తూనే…తన పుట్టిన రోజు గురించి మాట్లాడారు.
అక్టోబర్ 15న సాయి ధరమ్ పుట్టిన రోజు. తన పుట్టిన రోజు నాడు అభిమానులు అక్కడక్కడా కేక్ కటింగ్‌లు, బ్యానర్లు కట్టడం వంటి చేస్తున్నారని
,వాటికి పెట్టే ఖర్చు బదులు..ఆ డబ్బుని ఎవరైనా చిన్నారి చదువుకి ఉపయోగించండి. అలా చేస్తే నేను ఇంకా ఎక్కువగా ఆనంద పడుతానని తన
అభిమానులకి రాసిన లేఖలో పేర్కొన్నాడు. తన అభిమానుల సలహాలతోనే తనని కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నా అని తెలిపాడు.
అయితే రజనీకాంత్, చిరంజీవి లాంటి వాళ్లు …తమ పుట్టిన రోజులు జరపొద్దు..ఆ సొమ్ముని సామాజిక కార్యక్రమాలకు వినియోగించండి అంటే అర్దం ఉంది కానీ ఇప్పుడిప్పుడే ఎదురుగుతున్న సాయి లాంటి ఇలా కామెంట్ చేయటం ఏమిటని కొందరు కామెడీ చేస్తున్నారు. అయితే మంచి పని చేయటానికి, మంచి విషయం చెప్పటానికి చిన్న,పెద్దా అనే తేడా ఏముంది చెప్పండి.