ప్రస్తుతం టాలీవుడ్ సింగర్స్‌పై కరోనా పంజా విసిరింది. మొదటగా సింగర్ స్మిత కరోనా బారిన పడగా కొద్ది రోజుల క్రితమే గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి కరోనా సోకింది. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. తాజాగా సింగర్ మాళవిక, సునీతలకు కరోనా సోకింది. తనకు కరోనా సోకిందనే విషయాన్ని సునీత సోషల్ మీడియా వేదికగా ఒప్పుకుంది. తనకు కలిగిన లక్షణాలు, అనుభవాల గురించి చెప్పుకొచ్చింది.
అయితే సునీత తన అనుభవాలను చెబుతూ ఇంగ్లీష్‌లోనే ఎక్కువగా మాట్లాడింది. అయితే అన్ని భాషల వారికి సౌలభ్యంగా ఉండేందుకు అర్థమయ్యేందుకు అలా మాట్లాడి ఉండొచ్చు. కానీ నెటిజన్స్ మాత్రం అలా అనుకోలేదు. ఆంగ్ల భాషలో సునీత వీడియో పెట్టడంపై నెటిజన్స్ ఫైర్ అయ్యారు. అలా నెగెటివ్ కామెంట్స్‌ను చూసిన సునీత్ సీరియస్ అయింది. ఈ మేరకు ఓ షాకింగ్ పోస్ట్ పెట్టింది.
‘అందరికీ నమస్కారం. మొన్న నేను పెట్టిన వీడియో కి స్పందించి నా బాగోగులు కోరుకున్న నా అభిమానులందరికి కృతజ్ఞతలు . ఈ వీడియో యూట్యూబ్‌లో చెక్కర్లు కొడుతోంది. మంచిది. నేను తెలుగుతో పాటు తమిళ కన్నడ భాషల్లో కూడా పాటలు పాడటం వలన అక్కడకూడా అభిమానులు నాతో మాట్లాడుతూ వుంటారు. అందరికీ ఒకేసారి విషయం తెలుస్తుందని ఎక్కువ ఆంగ్లంలో మాట్లాడటం జరిగింది. కానీ విషయం వదిలేసి సమాజం లో ఉన్న చాలా మంది న్యాయనిర్ణేతలు(కోర్టు లో ఉండేవారు కాదు) “ఏ తెలుగు రాదా, ఫ్యాషన్ ఆ, కరోనా వస్తే ముందు హాస్పిటల్ కి వెళ్లి చావు మీడియా లో పబ్లిసిటీ కోసం అవసరమా” లాంటి తీర్మానాలు చేస్తుంటే ఈరోజు నుండి కారోనా గురించి నా అనుభవం మరియు నేను కల్పించాలనుకున్న అవగాహన కార్యక్రమాలు విరమించుకుంటున్నాను. ఇంకా ఏం వినాల్సొస్తుందో .. వున్నవి చాలవా… గాడ్ బ్లెస్ యూ’ అంటూ సునీత చెప్పుకొచ్చింది.