పాన్ ఇండియా సినిమాలు ఎన్ని ఉన్నా కూడా అందరి చూపు ఎక్కువగా పుష్ప పైనే ఉంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా కావడంతో ఆల్ రెడీ సౌత్ లో అంచనాల డోస్ అమాంతంగా పెరిగిపోయాయి. ఇక హిందీ డబ్బింగ్ సినిమాలతో ఆల్ రెడీ ఓ వర్గం నార్త్ ఆడియెన్స్ ను ఆకట్టుకున్న అల్లు అర్జున్ ఈ సారి డైరెక్ట్ గా బిగ్ స్క్రీన్ పై ఎంతవరకు సక్సెస్ అవుతాడు అనేది చర్చనీయాంశంగా మారింది.
ఇక ఈ సినిమా షూటింగ్ కు అనుకోని విధంగా కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఎక్కువగా అడవులలో షూటింగ్ చేయాల్సి ఉండడం వలన కొన్ని చోట్ల అనుమతులు దొరకడం లేదు. ఇక మొన్న కేరళలో మొదలు పెట్టగా అనుకోకోకుండా కోవిడ్ ఎఫెక్ట్ గందరగోళానికి గురి చేసింది. దీంతో షూటింగ్ కు మళ్ళీ బ్రేక్ పడింది. ఇక ఈ సమస్యలు మళ్ళీ రాకుండా ఉండాలని దర్శకుడు ఒక పెద్ద రిస్క్ చేయబోతున్నట్లు సమాచారం. రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఒక పెద్ద ఫారెస్ట్ ను సేటప్ చేయించాలని అనుకుంటున్నారట.
నార్మల్ సెట్స్ ఎంత ఖర్చయినా సెటప్ చేయవచ్చు గాని ఫారెస్ట్ సెటప్ అంటే చాలా కష్టమైన పని. మళ్ళీ ఎలాగైనా సీజీ వర్క్ తప్పదు. మరి ఈ కష్టమైన టాస్క్ ను చిత్ర యూనిట్ ఎలా పూర్తి చేస్తుందో చూడాలి. ఇక సినిమా షూటింగ్ ను వచ్చే ఏడాది ఏండింగ్ లోపు ఫినిష్ చేయాలని చేస్తున్నారు. కుదిరితే వచ్చే ఏడాది ఏండింగ్ లో నైనా సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉండవచ్చట. కానీ సుకుమార్ అంత స్పీడ్ గా ఫినిష్ చేయగలడా అనేది బిగ్ మిస్టరీ. చూడాలి మరి ఏం జరుగుతుందో..