రష్మీతో రొమాన్స్.. పంపు సెట్ దగ్గరికి పిలిచిన సుధీర్!

Sudheer Romance With Rashmi

రష్మీ సుధీర్ జోడి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిందే. గత ఏడేళ్లుగా వీరిద్దరి కెమిస్ట్రీ అలా సాగుతూనే ఉంది. బుల్లితెరపై వీరి రొమాన్స్ ఓ రేంజ్‌లో పండుతుంది. వీరి జోడికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అదే విషయాన్ని వీరిద్దరు బాగానే క్యాష్ చేసుకుంటున్నారు. అందుకే ఢీ షోలోనూ వీరిద్దరితో మోతాదుకు మించి రొమాన్స్ పండించి ఎమోషనల్ అయ్యేలా చేస్తుంటారు.

జబర్దస్త్ షోలో మొదటి నుంచి రష్మీపై కౌంటర్స్ వేయడం, పులిహోర కలపడం సుడిగాలి సుధీర్‌కు అలవాటైన పనే. వీరిద్దరి రొమాంటిక్ డైలాగ్స్, స్కిట్స్‌లో రష్మీని వాడేయడం మనం కొన్నేళ్లుగా చూస్తూనే ఉంటాం. ప్రతీ స్కిట్‌లో ఏదోలా రష్మీపై పరోక్షంగా పంచ్‌లు వేయడం కామన్‌గా జరుగుతూనే ఉంది. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందన్న అనుమానం కలిగేలా డబుల్ మీనింగ్ డైలాగ్స్, ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుంటారు.

తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలోనూ రష్మీని బాగానే వాడేశాడు. ఏకంగా పంపు సెట్ దగ్గరికి రా అంటూ అందర్నీ షాక్‌కు గురి చేశాడు. స్కిట్‌లో భాగంగా సుధీర్.. ఏం రష్మీ పొలం పనులకు రావడం మానేశావ్.. సాయంత్రం పంపు సెంటు దగ్గరికి రా అని అనడంతో రష్మీ షాక్ అయింది. ఇలాంటి ఝలక్‌లు, అవాక్కులు ఆమెకు, చూసే ప్రేక్షకులకు ఎప్పటి నుంచో అలవాటైపోయాయ్. అయితే ఏది ఏమైనా వీరిద్దరి మధ్య ఉన్న ఆ కెమిస్ట్రీ మాత్రం ఇంకా వర్కవుట్ అవుతూనే ఉంది. మొత్తానికి రాబోయే వారం ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో మాత్రం దుమ్ములేపుతోంది.