ఛీ ఛీ క్యారవాన్‌లో సుధీర్ అలాంటి పనులు చేస్తాడా?

Sudigali Sudheer Activities In Caravan

టాలీవుడ్‌లో క్యారవాన్‌ల కల్చర్ ఎప్పటి నుంచో ఉంది. చిన్న చిన్న ఆర్టిస్ట్‌లకు క్యారవాన్‌లుండవు గానీ స్టార్ స్టేటస్ పొందిన ప్రతీ ఒక్కరికీ ఉంటాయి. ఒక సెట్‌లో దాదాపు ఐదారు క్యారవాన్‌లు కూడా ఉంటాయి. స్టార్ హీరోలు అయితే కొందరు తమ సొంతంగా క్యారవాన్‌లను డిజైన్ చేయించుకుంటారు. ఇప్పుడు ఈ క్యారవాన్‌ల గొడవంతా ఎందుకంటే.. సుడిగాలి సుధీర్ గురించి సంచలన నిజాలు బయటకు వచ్చాయి. క్యారవాన్‌లో చేసే బాగోతాన్ని హైపర్ ఆది వివరించాడు.

Sudigali Sudheer
Sudigali Sudheer

ఢీ షోలో హైపర్ ఆది, సుధీర్, ప్రదీప్, శేఖర్ మాస్టర్ చేసే అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో వీరు చేసే స్కిట్స్, వేసే కౌంటర్స్ బుల్లితెర ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటాయి. అంతేకాక రష్మీ సుధీర్, వర్షిణి ఆదిల రొమాన్స్ ఢీ షోకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. తాజాగా ఢీ షోకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. అందులోనే హైపర్ ఆది సుధీర్ గుట్టును బయటపెట్టాడు హైపర్ ఆది.

స్కిట్‌లో భాగంగా సుధీర్ క్యారవాన్‌లా మారిపోయాడు హైపర్ ఆది. ఇక క్యారవాన్ తన మనుసులో సుధీర్ గురించి ఏమని అనుకుంటుందో, అతను చేసే పనులపై ఎలాంటి కామెంట్స్ చేసి ఉంటుందో ఆది చెప్పుకొచ్చాడు. ఏంటి ఈడొచ్చాడు.. ఎవరైనా వచ్చాకే వీడు రావాలి కదా.. ఏంటి ఈ రోజు ఒక్కడే వస్తున్నాడు. ఎవరో ఒకరు రావాలి కదా.. హా హా వస్తున్నారు.. వచ్చారు చెయ్ రా ఏదోకటి చేయాలి కదా.. ఏంటి ఇంకొకరు వస్తున్నారు.. వీళ్లు వెళ్లాక కదా.. అంటూ హైపర్ ఆది నవ్వులు పూయించాడు. నిజంగానే సుధీర్ అలాంటి పనులు చేస్తాడా? అని నెటిజన్స్ చెవులు కొరుక్కుంటున్నారు.