హీరోలుగా రాణిస్తూ అవసరం , అవకాశం వచ్చినప్పుడు నిర్మాణ రంగంలోకి వచ్చిన హీరోలు ఎందరో వున్నారు . అగ్ర స్థాయిలో వున్న హీరోలు కేవలం కమర్షియల్ సినిమాలకె పరిమిత అన్నట్టు నిర్మాతలు అలాంటి కథలనే వినిపిస్తారు . ఫార్ములాకు భిన్నంగా విన్న కథలు చేద్దామని అన్నప్పుడు నిర్మాతలు ముందుకు రారు . రిస్క్ తీసుకుంటే చేతులు కాల్చుకొనే ప్రమాదం ఉందని భయ పడతారు . ఆ కథ నిజంగా నచ్చి నిర్మాత వెనకడుగు వేసినప్పుడు, అభిరుచి వున్న హీరో అయితే అతనే నిర్మాతగా మారతాడు . అందుకు ఉదాహరణగా ఎందరో నటీనటులు వున్నారు . రామారావు, నాగేశ్వర రావు, కృష్ణ, కృష్ణం రాజు, సావిత్రి , భానుమతి, మొదలైన వారు వున్నారు . ఇప్పటి హీరోల్లో కూడా ఎన్టీయార్ , రాంచరణ్, అల్లు అర్జున్ లాంటి వారు వున్నారు . హీరో నిర్మాత అయితే దర్శకుడు భావాలకు తగ్గట్టు నిర్మిస్తారు . ఖర్చు విషయంలో వెనకడుగు వెయ్యరు .
ఇప్పుడు హీరోగా ఉండి నిర్మాతగా మారిన హీరో సుధీర్ బాబు , సూపర్ స్టార్ కృష్ణ , మహేష్ బాబు ప్రోత్సాహం తో సినిమా రంగంలో అడుగు పెట్టినా అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ఓ ప్రత్యేకతను, గుర్తింపునూ సంపాదించుకున్నాడు . ఈ సంవత్సరం ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సమ్మోహనం సినిమా విజయవంత అయిన తరువాత కొత్త దర్శకుడు ఆర్.ఎస్ నాయుడు కథ నచ్చి హీరోగా నటిస్తానన్నాడు . అంతకు ముందు నిర్మిస్తానన్న వ్యక్తి చేతులు ఎత్తేసాడు . ఆ కథ బాగా నచ్చడంతో సుధీర్ బాబు తానే నిర్మిస్తానని హామీ ఇచ్చి నిలబెట్టుకున్నాడు . అదే “నన్ను దోచుకుందువటే ” చిత్రం . ఈ సినిమా బాగుందని ప్రశంసించడం కలెక్టన్లు పెరగడంతో సుధీర్ బాబు మహా ఉత్సాహం తో వున్నాడట. తాను తీసుకున్న నిర్ణయం తన నమ్మకాన్ని పెంచిందని చెబుతున్నాడు . “నన్ను దోచుకుందువటే ” చిత్రం విజయంతో తాను నిర్మాత గా కొనసాగుతానని సుధీర్ బాబు ప్రకటించాడు .