షాకింగ్ లుక్: స‌్టార్‌ హీరోయిన్ మేక‌ప్ తీసేశాక‌..!

                                     అమ్మ‌మ్మ‌లా మారిపోయిన స్టార్ హీరోయిన్

స‌మీరారెడ్డి.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు ఇది. టాలీవుడ్ లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న వ‌రుస‌గా సినిమాల్లో న‌టించిన ట్రాక్ రికార్డ్ ఈ భామ సొంతం. మెగాస్టార్ చిరంజీవి స‌హా ప‌లువురు అగ్ర క‌థానాయ‌కుల స‌ర‌స‌న నాయిక‌గా న‌టించింది. కాల‌క్ర‌మంలో బాలీవుడ్ కి షిఫ్ఠ‌యిన ఈ హైద‌రాబాదీ బ్యూటీ అక్కడా ప‌లు చిత్రాల్లో న‌టించింది. 2014లో బిజినెస్ మేన్ అక్ష‌య్ వార్ధేని స‌మీరా రెడ్డి ప్రేమించి పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఓ బిడ్డ‌కు త‌ల్లిగా సంసార జీవ‌నం సాగిస్తోంది.

అయితే ఈ భామ తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు షాకింగ్ విష‌యాల్ని చెప్పుకొచ్చింది. అస‌లు త‌న రూపం ఇది కాద‌ని ఒరిజిన‌ల్ రూపం వేరేగా ఉంటుంద‌ని పూర్తిగా ఓపెనైపోయింది. త‌న శ‌రీరాన్ని పూర్త‌గా ప్యాడ్స్ తో క‌వ‌ర్ చేసి తెర‌పై క‌నిపించేద‌ట‌. వాచిన క‌ళ్లు.. పండిన వెంట్రుక‌ల్ని మీడియాకి ఓపెన్ గానే చూపించింది స‌మీరా. త‌న కంటి అందం కోసం లెన్స్ ఉప‌యోగించాన‌ని వెల్ల‌డించింది.

తాను అంద‌గ‌త్తెను కాను అని అంగీక‌రించ‌డ‌మే ఒక దుస్సాహ‌సం అనుకుంటే ఏకంగా త‌న గెట‌ప్ మొత్తం రివీల్ చేస్తూ ఓ వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేసి షాకిచ్చింది. ఇందులో పండిన త‌ల‌వెంట్రుక‌లు .. ముఖంపై మ‌చ్చ‌లు ఫ్యాన్స్ ని షాక్ కి గురి చేస్తున్నాయి. స‌మీరా ఒరిజిన‌ల్ రూపం ఇదే.. అయితే త‌న డేరింగ్ డెసిష‌న్ కి ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.