ఐటెం సాంగ్‌కి నో చెప్పిన మృణాల్ ఠాకూర్.!

చేతిలో వున్నవి రెండు మూడు సినిమాలే అయినా మృణాల్ ఠాకూర్ అంత తేలిగ్గా దొరకడం లేదట దర్శక, నిర్మాతలకి. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ తాజాగా మృణాల్‌ ఠాకూర్‌ని స్పెషల్ సాంగ్ కోసం సంప్రదించిందట.

అయితే, చేయాలా.? వద్దా.? అనే మీమాంశతో తొలుత ఆలోచిస్తానని చెప్పిందట మృణాల్ ఠాకూర్. కానీ, ఆ తర్వాత నో చెప్పేసిందట. ఇప్పుడప్పుడే స్పెషల్ సాంగ్స్ వద్దంటూ ఓ సినీ ప్రముఖుడు ఆమెకిచ్చిన సలహా మేరకే ఈ ప్రతిపాదన తిరస్కరించిందట మృణాల్ ఠాకూర్.

ఇంతకీ ఆ సినీ ప్రముఖుడెవరు.? అయినా స్పెషల్ సాంగ్స్‌లో నటిస్తే తప్పేముంది.? బోలెడంత పాపులారిటీ పెరుగుతుందిగా.! స్టార్ స్టేటస్ వుండీ, చేతి నిండా బోలెడన్ని సినిమాలతో బిజీగా వున్న టైమ్‌లోనే పూజా హెగ్ధే ‘రంగస్థలం’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఆ స్పెషల్ సాంగ్ వల్ల ఆమె కెరీర్‌కి మరింత యూజే అయ్యింది కానీ, హీరో్యిన్‌గా ఆమె స్టార్‌డమ్‌కి ఏమీ ఫరక్ పడలేదుగా.