వరుస ఫోటోషూట్లతో దుమారం రేపుతోంది శ్రుతిహాసన్. ప్రియుడు మైఖేల్ కోర్సలే నుంచి విడిపోయిన తర్వాత ఈ అమ్మడు నెమ్మదిగా ఆ జ్ఞాపకాల నుంచి బయటపడుతోంది. ఓవైపు సినిమాలు .. మరోవైపు ఫోటోషూట్లు ఇవే కాలక్షేపం. వీటన్నిటినీ మించి తనకు ఎంతో ఇష్టమైన మ్యూజిక్ బ్యాండ్ వ్యాపకాన్ని శ్రుతి అస్సలు విడిచిపెట్టడం లేదు.
ఇప్పటికే శ్రుతి హాసన్ ఇన్ స్టా మాధ్యమం ఫోటోషూట్లతో హీటెక్కించేస్తోంది. తాజాగా రివీల్ చేసిన ఫిలింఫేర్ కవర్ పేజీ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. మాస్క్ ధరించిన శ్రుతిహాసన్ సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది. పాపిడి బిళ్ల మొదలు ముక్కుకు తొడుక్కున్న మాస్క్ బంగారు వజ్ర వైఢూర్యాలతో తయారు చేసినది అట. ప్రస్తుతం ఈ ఫోటో ఫ్యాన్స్ లో వైరల్ అవుతోంది.
ఇంతకుముందు శ్రుతి షేర్ చేసిన వెడ్డింగ్ ఫోటోషూట్ అంతే వైరల్ గా దూసుకెళుతోంది. శ్రుతి జల్లెడ డిజైనర్ వేర్ .. దానికి కాంబినేషన్ బంగారు ఆభరణాలు ఆకట్టుకున్నాయి. ఇక శ్రుతి స్పెషల్ మేకప్ మైమరిపించింది.
`వెడ్డింగ్ వావ్స్` మ్యాగజైన్ ఫోటోషూట్ సిరీస్ లో ఈ ఫోటో సంథింగ్ స్పెషల్. ఈ స్పెషల్ ఫోటోషూట్లకు శ్రుతి స్వయంగా మేకప్ సహా డిజైనింగ్ స్పెషలిస్ట్ కావడం విశేషం.
శ్రుతి నటించిన యారా జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. విద్యుత్ జమ్వాల్ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించారు. శ్రుతి నటించిన తెలుగు సినిమా `క్రాక్` దసరా బరిలో రిలీజ్ కానుంది. మాస్ మహారాజా రవితేజ సరసన కొంత గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.