వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి రకుల్ పై వ్యాఖ్యలు చేసింది. గతంలో కాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీలో లేదని శ్రీరెడ్డి, మాధవి లతల ఆగ్రహానికి గురైంది రకుల్. ఇద్దరూ ఆమెని చెడుగుడు ఆడేసుకున్నారు. నీకు అలాంటివి ఎదురవకపోతే ఇంకా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేనట్టేనా. కమిట్మెంట్స్ ఇవ్వకుండానే టాప్ హీరోయిన్ ఎలా అయ్యావ్ అంటూ మండి పడ్డారు.
కాస్టింగ్ కౌచ్ పై స్పందించిన తమిళ నటి ఆండ్రియా…శ్రీరెడ్డి విషయంపై పాజిటివ్ గా మాట్లాడింది. నాకు ఇలాంటి అనుభవం ఎదురు కాలేదు కానీ ఎవరికైనా అలాంటివి ఎదురైనప్పుడు ముందుకు వచ్చి పోరాడటానికి చాల ధైర్యం కావాలి. శ్రీరెడ్డి ఆ విషయంలో సరైన పని చేసింది. ఒకవేళ ఆమె కాస్టింగ్ కౌచ్ బాధితురాలు అయితే నేరస్థులను తప్పక శిక్షించాలి అంటూ వ్యక్తం చేసింది ఆండ్రియా.
ఇప్పుడు ఇదే విషయంతో రకుల్ పై కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి. రకుల్ ప్రీత్ సహ నటీమణుల గురించి ఎలా మాట్లాడాలో తమిళ నటి ఆండ్రియాని చూసి నేర్చుకో. అంటూ తన వాల్ పైన పోస్ట్ పెట్టింది.