తెలుగు, తమిళ ఇండస్ట్రీలో మీటూ, క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసింది శ్రీ రెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో శ్రీ రెడ్డి సంచలనాల గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. సినీ, రాజకీయ అంశాలపై పచ్చిగా మాట్లాడే శ్రీ రెడ్డికి సోషల్ మీడియాలో విపరీతమైన పాపులార్టీ ఉంది. సోషల్ మీడియాలో శ్రీ రెడ్డిని ఫాలో అయ్యే వాళ్లు కొన్ని లక్షల మంది ఉన్నారు. అయితే తన ఫాలోవర్స్‌కు అప్పుడప్పుడు స్వీట్ సర్ ప్రైజ్‌లు ఇస్తుంటుంది శ్రీ రెడ్డి. అందులో భాగంగా మత్తెక్కించే ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
మెగా ఫ్యామిలీ, నాని, దగ్గుబాటి ఫ్యామిలీని శ్రీ రెడ్డి ఏ రేంజ్‌లో ఆడుకుంటుందో, వారిని వాడుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. సమయం సందర్భం లేకపోయినా సరే వారిని ఓ రేంజ్‌లో ఆడుకుంటుంది. అయితే కొన్ని రోజుల నుంచి మాత్రం శ్రీ రెడ్డి చాలా సైలెంట్‌గా ఉంటుంది. మరీ ముఖ్యంగా రానా పెళ్లిపై ఏదైనా సన్సేషన్ కామెంట్స్ చేస్తుందని అంతా భావించారు. కానీ ఆ విషయంపై శ్రీ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు.
రానా బావాకు పెళ్లి అంటూ అప్పట్లో నానా రకాల పోస్ట్‌లు చేసింది. కానీ కొన్ని రోజుల నుంచి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలేవీ చేయడం లేదు. కానీ తన అందాల చెందాల వలను మాత్రం విసురుతోంది. ఫేస్ బుక్‌లో శ్రీ రెడ్డి షేర్ చేసే ఫోటోలను చూస్తే ఎవ్వరైనా సరే షాక్ అవ్వాల్సిందే. ఇక రీసెంట్‌గా ఒంటి మీద నూలు పోగు లేకుండా ఉన్న ఓ ఫోటోను షేర్ చేసింది. అయితే ఆ ఫోటోలో ఉన్న మనిషి వెనక్కి తిరిగి ఉండటంలో అంతా డిసప్ఫాయింట్ అయ్యారు. ముందుకు తిరుగు అని కొందరు అంటుంటే.. అది శ్రీ రెడ్డి బాడీ కాదని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరి కొందరు పోస్ట్‌తో సంబంధం లేకుండా రానా పెళ్లిలో శ్రీ రెడ్డి కనబడలేదనంటూ హాస్యాన్ని పండిస్తున్నారు. ఏది ఏమైనా శ్రీ రెడ్డి షేర్ చేసిన ఫోటో మాత్రం సెగలు రేపుతోంది.