స్వాతి నాయుడు పెళ్లిపై శ్రీరెడ్డి స్పందన

రీసెంట్ గా స్వాతి నాయుడు ఫిబ్రవరి 23న అవినాష్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎనిమిది నెలలుగా లివ్ ఇన్‌ రిలేషన్ షిప్‌లో ఉన్నామని, ఆ అబ్బాయికి అన్నీ తెలిసే తనతో రిలేషన్ పెట్టుకున్నాడని, ఇద్దరికీ ఇష్టం కాబట్టే తమ బంధం పెళ్లి వరకు వచ్చిందని స్వాతినాయుడు చెప్పుకొచ్చారు.

ఇక స్వాతి నాయుడు వివాహంపై శ్రీరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీ పెళ్లి జరుగడం తనకు సంతోషాన్ని ఇచ్చింది అంటూనే కొన్ని సూచనలు చేసింది. కంగ్రాట్యులేషన్స్ స్వాతి గారు. మీరంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంది. మీ పెళ్లి విషయం తెలిసి చాలా సంతోషపడ్డాను. మీరు ఇటీవల మీ భర్తతో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూ చూశాను. మీరిద్దరూ చాలా సంతోషంగా కనిపించారు.ఈ ఇంటర్వ్యూలో యాంకర్ మీ ఫస్ట్ నైట్ గురించి గుచ్చి గుచ్చి అడగటం నాకు కోపం తెప్పించింది.

నేను అక్కడ ఉంటే అతడిని చంపేసేదాన్ని. నాకు గానీ ఆ యాంకర్ కనిపిస్తే తప్పకుండా చెంప వాయిస్తాను. అలాంటి వారిని ఎంకరేజ్ చేయవద్దు.. అని శ్రీరెడ్డి సూచించారు.వీలైతే మీరు ఆ డర్టీ ఫీల్డ్ వదిలేయండి. యాంకర్ ఓవర్ యాక్షన్ చేయడంతో మీ భర్త ఫేసులో కాస్త అసౌకర్యానికి గురైన భావన కనిపించింది. ఆయన్ను బాగా చూసుకో. ఐలవ్ యూ…. అంటూ స్వాతినాయుడు పై తన ప్రేమాభిమానాలు చాటుకుంది శ్రీరెడ్డి.