కోసిపారేస్తే.. ఇండస్ట్రీలో 90 శాతం మందికి అది ఉండదు
శ్రీరెడ్డి సెన్సేషన్ కోసం మాట్లాడుతోందో లేక సామాజిక అంశాలపై స్పందిస్తోందో అర్దంకాకుండా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతుంది. ఈ మధ్యకాలంలో వర్మ జోరు అయినా కాస్త తగ్గిందేమో కానీ శ్రీరెడ్డి మాత్రం కొంచెం కూడా వెనకడుగు వెయ్యటం లేదు. ఎక్కడేం జరిగినా దాన్ని తెలుగు సినీ పరిశ్రమకు ముడిపెడుతూ రెచ్చిపోయే స్టేట్మెంట్స్ ఇస్తోంది.
రీసెంట్ గా కేరళలో తనను రేప్ చేయపోయిన ఓ సన్యాసి పురుషాంగాన్ని కోసిపారేసింది ఓ యువతి.ఆ విషయంపైనా శ్రీరెడ్డి వెంటనే స్పందించింది.
ఇలా కోసేస్తే.. సినిమా ఇండస్ట్రీలో తొంభై శాతం మంది పురుషాంగం లేకుండా ఉండేవాళ్లు అంటూ సంచలన కామెంట్స్ చేసింది. ఈ లెక్కల్లో ఇండస్ట్రీలో 90 శాతం మంది రసికరాయుళ్లు ఆడవాళ్లకు ఇష్టం లేకుండానే రేప్‌లు చేస్తున్నారని చెప్పకనే చెబుతున్నట్లు అయ్యింది.
<
p style=”text-align: justify”>కేరళలో సంచలనం కలిగించిన ఈ ఘటన మీడియాలో హైలైట్ కావడంతో ఈ పేపర్ కటింగ్‌ని తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. ఇండస్ట్రీపై ఇలా విరుచుకు పడింది శ్రీరెడ్డి. అక్కడెక్కడో కేరళలో రేప్ అటెంప్డ్ జరిగితే.. ఇండస్ట్రీ వాళ్లను ఇలాగే చేయాలని అనడం ఏమిటని సినిమా వాళ్ళు చిరాకు పడుతున్నారు. ఎవరు ఎలా రెస్పాండ్ అయినా తనకేంటి అన్నట్లు శ్రీరెడ్డి ముందుకు వెళ్తూనే ఉంటుంది.