ఆ షోను లాగేసుకుందట.. శ్రీముఖి సుమ మధ్య వైరం

Sreemukhi about Suma In Start Music

బుల్లితెరపై యాంకర్స్ మధ్య కనబడని వైరం ఉంటుంది. రష్మి అనసూయ మధ్య ఉన్న ఉండే దూరం, గొడవలు అయితే అందరికీ తెలిసిందే. వారిద్దరి మధ్య ఉండే తగువులాటల గురించి జబర్దస్త్ ఆర్టిస్ట్‌లే ఎన్నో స్కిట్లు వేశారు. ఇంకా వేస్తూనే ఉన్నారు. వాళ్లిద్దరూ కెమెరాలు కనిపిస్తే చాలు బేబీ అంటూ అతుక్కుపోతారని, తరువాత ఒకరినొకరు తిట్టుకుంటారని చెబుతుంటారు. అయితే అందులో ఎంత నిజముందో వారికే తెలియాలి. మామూలుగా ఒకే రంగంలో ఉన్న వారి మధ్య ఇలాంటివి కామన్.

Sreemukhi about Suma In Start Music
Sreemukhi about Suma In Start Music

అయితే ఎవరి మధ్య ఎలా ఉన్నా కూడా సుమతొ అందరూ చక్కగా కలిసిపోతుంటారు. ఆమెతో ఎవ్వరూ కూడా గొడవలు పెట్టుకోరు. కానీ తాజాగా శ్రీముఖి కెమెరా ముందే సుమకు వార్నింగ్ లాంటిది ఇచ్చేసింది. ప్రస్తుతం స్టార్ట్ మ్యూజిక్ అనే షో వస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ షోను సుమ హోస్ట్ చేస్తోంది. కానీ అంతకు ముందు ఝాన్సీ హోస్ట్ చేసేది. ఆ తరువాత శ్రీముఖిని పెట్టి మళ్లీ కొత్తగా ప్రారంభించారు. స్టార్ట్ మ్యూజిక్ రీ లోడెడ్ అంటూ పెట్టి గ్రాండ్‌గా లాంచ్ చేశారు.

కానీ అది కూడా వర్కవుట్ కాలేదు. అలా మళ్లీ షోను సుమ చేతిలో పెట్టేశారు. ఇప్పుడు సుమ ఈ షోను తనదైన శైలిలో ముందుకు తీసుకెళ్తోంది. అయితే వచ్చే వారం ప్రసారం కాబోతోన్న షోలో శ్రీముఖి తన గ్యాంగ్‌తో ఎంట్రీ ఇచ్చింది. పండు, ఎక్స్‌ప్రెస్ హరిలతొ ఎంట్రీ ఇచ్చింది. స్టార్ట్ మ్యూజిక్ షో శ్రీముఖి అడ్డా అంటూ… ఇక్కడ కనకాల అనే ఓ హోస్ట్ ఎవరో ఉన్నారట.. కదా ఎవరు అని శ్రీముఖి కౌంటర్ వేసింది. అయితే అది షో కోసమే అయినా నిజంగానే తన మనసులో కూడా అలాంటి భావమే ఉండొచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.