రుజువైతే: త్రివిక్రమ్ లాగానే మురగదాస్ కు కూడా అవమానమే

                                                                            (సూర్యం)

ప్రముఖ దర్శక,రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ పరువుని కాపీ ఆరోపణలు తీసేసాయి. నితిన్ తో చేసిన అ…ఆ సినిమా యద్దనపూడి సులోచనారాణి చిత్రం కథ నుంచి చెప్పాపెట్టకుండా ఎత్తేసారని అప్పట్లో వివాదం ప్రారంభమైంది. ఆ తర్వాత పవన్ తో చేసిన అజ్ఞాతవాసి సినిమా కూడా ఓ ఫ్రెంచ్ చిత్రం లార్గోవించ్ ఆధారం అని ఆ ఫ్రెంచ్ దర్శకుడే సోషల్ మీడియాలో మొత్తుకున్నాడు.  సరే ..అవన్నీ ప్రక్కన పెడితే రీసెంట్ గా చేసిన అరవింద సమేత సైతం కాపీ ఆరోపణలలో ఇరుక్కుంది. ఆ సమయంలో అందరూ ఆయన్ని తిట్టిపోసారు. రుజువులతో సహా బయటపడటంతో ఏమీ అనలేని పరిస్దితి. మాట్లాడితే తప్పు ఒప్పుకోవాలి. అందుకే ఆ సమయంలో మాట దాటేసాడు. ఇప్పుడు సరిగ్గా అలాంటి పరిస్దితే మురగదాస్ కు ఎదురౌతోంది.

విజయ్, మురుగదాస్ కలయికలో వచ్చిన   కత్తి సినిమా సైతం కాపీ ఆరోపణలు ఎదుర్కొంది. తెలుగు రీమేక్ అప్పుడు సెటిల్ చేసారు. అయితే ఆ సినిమా  సూపర్ హిట్ అవటంతో పెద్ద పట్టింపు లేకపోయింది. ఇక వీరిద్దరి కాంబోలో మరో సారి తెరకెక్కిన మూవీ “సర్కార్”. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో వల్లభనేని అశోక్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు హక్కులు కొనుగోలుచేశారు.

దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్‌ 6న‌ ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల‌లో విడుద‌ల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ చిత్రం ిడుదల ప్రస్నార్ధకంగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం ఈ మూవీపై కోర్టు కేసు నడుస్తోంది. దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ తన కథను కాపీ కొట్టారంటూ వరుణ్ రాజేంద్రన్ అనే రచయిత, అసెస్టెంట్ డైరక్టర్ మద్రాస్ హైకోర్టుకు ఫిర్యాదు చేశారు.

2007లోనే సౌతిండియన్ ఫిలిం రైటర్స్ అసోసియేషన్ లో “సెంగోల్” అనే కథను రిజిస్టర్ చేయించానని, ఆ కథను మురుగదాస్ కాపీ కొట్టి  “సర్కార్” పేరుతో సినిమా తీసేశారని రాజేంద్రన్ ప్రధాన ఆరోపణ.  దీనిపై రైటర్స్ అసోసియేషన్ లోనూ విచారణ నడుస్తోంది.

కథ కాపీ కొట్టి సినిమా తీసినందుకు మురుగదాస్, కళానిధి మారన్ బృందం తనకు 30లక్షలు చెల్లించాల్సిందేనంటూ ఆ  రచయిత హైకోర్టులో  కేసు వేయడంతో న్యాయ విచారణ సాగుతోంది. తనకు రచయితగా పారితోషికం ముట్టే వరకూ రిలీజ్ ఆపాల్సిందిగానూ రాజేంద్రన్ కోర్టులో  వాదిస్తున్నారు. ఈ నేపధ్యంలో  “సర్కార్” రిలీజ్ ఆగుతుందా? లేకుంటే రైటర్ తో రాజీ కుదుర్చుకుంటారా? అనేది ఆసక్తికరమైన అంశం.