వేసవి కాలం. కావాల్సిన మామిడి పళ్ల రుచులు జుర్రే సీజన్. బంగినపల్లి..రసాలు..ఏనుగు దంతాలు ఇలా మామిడిలో చాలా రుచులే ఉన్నాయి. ఒక్కో రకం ఒక్కో రుచికి. పుర్రెకో బుద్ది జిహ్వకో రుచి అన్నట్లు. ఎవరి ఇష్టం వచ్చిన మామిడి పండ్లను వారు రుచి చూడొచ్చు. సెలబ్రిటీలు సైతం మామిడి పండ్లను బాగానే లాగిస్తారు. టాలీవుడ్ లో చాలా మంది సెలబ్రిటీలకు హైదరాబాద్ సీటీకి దూరంగా వందల ఎంకరాల్లో మామిడి తోటలున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, శివాజీ రాజా, నితిన్ సహా చాలా మంది నటీనటులకు, నటీమణులు అందుకుంటోన్న పారితోషికాలు భూములపైనే పెట్టి వాటిని టైంపాస్ గా సాగుచేస్తుంటారు.
వాటిలో అక్కడక్కడ ఇలా మాడిమి తోటలకు కొంత స్థలం కేటాయించి సాగుచేస్తున్నారు. ఇక తాజా సీజన్ మాడమి పండ్లది కాబట్టి తమకిష్టమైన సెలబ్రిటీలకు బుట్టల్లో ప్యాక్ చేసి ప్రతీ ఏడాది తిని ఆస్వాధించమని పంపించడం అనవాయితీగా వస్తోంది. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట కూడా మామిడి పండ్ల బుట్టలు కనిపించాయట. తమ ఫామ్ హౌస్ లో కోసినవి… అభిమానంతో ఓ మంత్రి చెర్రీ ఇంటికి ఎంతో ఇష్టంగా రకరకాల బ్రాండ్ల మామిడి పండ్లను పంపించాడుట. పనిలో పనిగా కొన్ని పుల్ల మామిడి కాయలు కూడా అందులో ఉన్నాయట. మరి ఆ పుల్ల మామిడి కాయలు పచ్చడి పెట్టేందుకా? లేక ఇంట్లో అవసరాలకా? అన్నది పక్కన బెడితే పుల్ల మాడిమి కాయల విషయం ఇప్పుడు ఇండస్ట్రీ అంతా ఠాం ఠాం అవుతోంది.
ఎప్పుడూ లేని ఈ పుల్ల మామిడి కాయల రచ్చ ఏంటి? అందులోనూ బాగా పరువుకు వచ్చిన విపరీతమైన పులుపు స్వభావం కలిగే నీలం రకం కాయలు ఆ ఇంట్లో ఎక్కువగా కనిపిస్తున్నాయట. దీంతో పుల్ల మామిడి కాయలపై రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ నటి దీపిక పదుకొణే అదే పనిగా పుల్ల మామిడి కాయల్లో ఉప్పు కారం మిక్స్ చేసుకుని అందులో మామిడి ముక్కను దట్టించి తింటోంది. దీంతో దీపిక గర్భవతి అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పడుతున్నాయి.