సినిమాల్లో విలన్ వేషాలు వేసే వాళ్లల్లో నిజమైన హీరో ఉంటాడని ఆ నాటి యస్వీఆర్ నుండి నేటి సోనూ సూద్ వరకూ నిదర్శనంగా నిలుస్తున్నారు. విలనిజాన్ని ఓ రేంజ్‌లో పండించే అలవాటు ఉన్న నటులు.. హీరోయిజాన్ని కూడా ఆంతే రేంజ్ లో పండిస్తారట. మెగాస్టార్ అండ్ మోహన్ బాబు నుండి గోపీచంద్ వరకూ అది ప్రూవ్ అయింది. అయితే యాక్టర్ సోనూ సూద్ మాత్రం రియల్ హీరో అని అనిపించుకున్నాడు. ఈ కరోనా పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా హీరో అయింది ఎవరైనా ఉన్నారు అంటే అది సోనూ సూదే. దేశ నలుమూలల సమస్య ఎక్కడ ఉన్నా వెంటనే స్పందిస్తూ, వారికి సహాయం చెయ్యడం ఒక్క ఈ రీల్ విలన్ కే సాధ్యం అయింది.
నిజానికి కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో ఇరుక్కుని ఎన్నో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకు ప్రభుత్వాలే మొహం చాటేస్తే.. సోనూ మాత్రం వాళ్లకు సాయం చేసి దేశ వ్యాప్తంగా చర్చకు తెరలేపాడు. వలస కార్మికులను వారి సొంత ఊర్లకు కంపెనీలపంపేదుకు సోనూ పడిన కష్టం, కృషికి ఎన్ని ప్రశంసలు కురిపించినా అది తక్కువే అవుతుంది. పైగా దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి అండగా ఉంటూ, తనదైన విధంగా సహాయం చేస్తున్నాడు. దేశంలో ఎవరికైన తమకు కష్టం అనే మాట వినిపిస్తే చాలు, వెంటనే ట్విట్టర్ లోకి వచ్చి సోనూ సూద్ కి మెసేజ్ చేసేస్తున్నారు.
వాటికి స్పందిస్తూ.. వారికి తనవంతుగా సహాయం చేస్తూ నిజంగా రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. దీంతో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అందరి చూపు సోనూ సూద్ పై పడింది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరు సోనూకి అభిమానిగా మారిపోతుండడంతో, అతడి పాపులారిటీ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో కార్పోరేట్ కంపెనీల కన్ను సోనూ పై పడిందట. ప్రస్తుతం సోనూ సూద్ రేంజ్ పీక్స్‌కు వెళ్ళడంతో, ఆ ఇమేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు, దేశ వ్యాప్తంగా ప్రముఖ వ్యాపార సంస్థలు తమ వాణిజ్య ప్రకటనలో నటించాలని సోనుకు భారీ ఆఫర్లు ఇస్తున్నాయి. మరి ఈ కార్పోరేట్ మాయలో సోనూ సూద్ పడితే మాత్రం అతను చాల నష్టపోవాల్సి వస్తోంది.