Sravanthi Chokkarapu: యాంకర్ స్రవంతి చొక్కారపు పరిచయం అవసరం లేని పేరు ఇటీవల కాలంలో యాంకర్ సుమకు పోటీ చేస్తూ ఈమె పెద్ద ఎత్తున సినిమా ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. అనంతపురం కదిరికి చెందిన స్రవంతి నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వెళ్లారు మొదటిగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఈమె అనంతరం యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి పెద్ద ఎత్తున సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ మంచి సక్సెస్ అందుకున్నారు. అనంతరం బిగ్ బాస్ అవకాశాన్ని కూడా అందుకున్నారు.
ఇలా బిగ్ బాస్ ద్వారా ఎంతో ఫేమస్ అయిన స్రవంతి ప్రస్తుతం యాంకర్ గా ఇండస్ట్రీలో స్థిరపడి కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలా పెద్ద ఎత్తున ఈ వెంట్లను చేస్తూ భారీగా సంపాదిస్తున్న స్రవంతి తన మంచి మనసును చాటుకున్నారు. ఇటీవల సత్యసాయి జిల్లా కల్లితాండకు చెందిన జవాన్ మురళి నాయక్ ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో భాగంగా మరణించిన సంగతి తెలిసిందే. ఇలా మురళి మరణించడంతో పెద్ద ఎత్తున తన కుటుంబాన్ని ఎంతో మంది రాజకీయ సినీ ప్రముఖులు స్పందిస్తూ ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు.
తాజాగా యాంకర్ స్రవంతి కూడా మురళి నాయక్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తూ అండగా నిలిచారని తెలుస్తోంది.సోలో బాయ్ సినిమా ట్రైలర్ ఈవెంట్ కు ఆమె యాంకర్ గా వ్యవహరించారు. అతిథులుగా పాల్గొన్న మురళీ నాయక్ తల్లిదండ్రులకు ఆమె ఏకంగా లక్ష రూపాయలు విరాళంగా అందించారు. ఇలా సహాయం చేయడం గురించి స్రవంతి మాట్లాడుతూ యుద్ధంలో మరణించిన తమ కొడుకును తిరిగి తీసుకురాలేము అయితే తన కుటుంబానికి ఆర్థికంగా భరోసా మాత్రమే ఇవ్వగలమని ఈ వేడుక పూర్తిగా బదిలీ చేస్తాను అంటూ ఈ సందర్భంగా స్రవంతి తెలియజేశారు. ఇలా ఈమె జవాన్ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడంతో తన మంచి మనసుపై నెటిజన్లు ఫిదా అవుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో కూడా స్రవంతి ఇలా ఎంతోమందికి తనకు తోచిన సహాయం చేస్తూ అండగా నిలిచారు.