Manchu Manoj: సహాయం చేయండి.. ప్రాణాలు కాపాడండి.. మంచు మనోజ్ ట్వీట్ వైరల్.. అసలేం జరిగిందంటే!

Manchu Manoj: టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గురించి మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు కొన్ని సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న మంచు మనోజ్ ఆ తర్వాత చాలా కాలం పాటు సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. ఇటీవల భైరవం సినిమాతో మళ్లీ సినిమా ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చారు. దాదాపు తొమ్మిదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న మంచు మనోజ్ ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వడంతో పాటు ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమా విడుదల సమయం నుంచి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు మంచు మనోజ్.

ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మంచు మనోజ్ తాజాగా సోషల్ మీడియా ఖాతాలో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. సహాయం చేయండి.. ఈ ప్రాణాలను రక్షించండి అంటూ కోరుతూ మంచు మనోజ్ ఒక ట్వీట్ చేశారు. ఇంతకీ ఆ ట్వీట్ ఏమిటి? అందులో ఏముంది అన్న విషయానికి వస్తే.. రెండు రోజుల చిన్నారి తన ప్రాణాలను కాపాడుకునేందుకు పోరాడుతోంది. పుట్టకతోనే ఇలాంటి కష్టాలు పడుతున్న ఆ చిన్నారిని చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఆ చిన్నారిని రక్షించుకునేందుకు ఆ కుటుంబం మొత్తం పోరాడుతుంది.

కానీ ఆ చిన్నారిని కాపాడటానికి రూ.10 లక్షలు అవసరం. అది వారికి చాలా పెద్ద మొత్తం. మీ వంతు సహాయం చేయండి. అది ఎంతైనా కావచ్చు ఒక ప్రాణం నిలబడుతుంది. నేను నా వంతు సహాయం చేశాను. ఈ చిన్నారిని కాపాడటానికి మనందరం కలిసి సహాయం చేద్దాం. ప్రతి సహాయం కూడా విలువైనదే అంటూ ఆ చిన్నారి కుటుంబ సభ్యుల బ్యాంక్‌ ఖాతాను షేర్‌ చేశారు. చాలామంది ఈ విషయంపై వెంటనే స్పందిస్తూ తోచినంత సహాయం చేశారు. ఇంకొందరు బ్యాంక్ అకౌంట్ సరిగా వర్క్ చేయడం లేదని స్క్రీన్ షాట్ పంపడంతో వెంటనే మనోజ్ మరొక బ్యాంకు ఖాతా నెంబర్ ను షేర్ చేశారు.