‘ఇస్మార్ట్ శంకర్’ కు కొత్త సమస్య
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మించిన ఈ చిత్రంలో నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం జూలై 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ,సక్సెస్‌ఫుల్‌గా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచి రూ.75 కోట్ల గ్రాస్‌ను సాధించింది.
అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమా కథ నాదంటూ హీరో ఆకాశ్ ఆరోపణలు చేశారు. తాజాగా ఈ సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. బెంగళూరు మల్టీప్లెక్స్‌ల్లో ఏర్పాటు చేసిన పోస్టర్లు వివాదానికి కారణమయ్యాయి. అదేంటంటే రామ్ సిగరెట్ తాగే పోస్టర్‌ను పబ్లిక్‌లో ప్రదర్శించడం చట్టరీత్యా నేరం అంటూ దీనిపై వివరణ ఇవ్వాలంటూ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ నిర్మాతలకు నోటీసులను పంపింది.
హీరో రామ్ మాట్లాడుతూ.. ‘‘సినిమా చూశాక ఎలా ఫీల్ అయ్యానో ఆడియన్స్ రెస్పాన్స్ చూశాక అదే ఫీల్ అయ్యాను. నేను ఇదివరకు చేస్తున్న పాత్రలకు భిన్నంగా ఈ సినిమాలో నా పాత్ర ఉందంటే.. అందుకు కారణం పూరీ గారు. నాకు ఒక మంచి క్యారెక్టరైజేషన్ ఇచ్చి నన్ను డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేసారు. ఈ సక్సెస్‌ను నా మంచి కోరుకునే వారందరికీ డెడికేట్ చేస్తున్నాను. మణిశర్మగారి సంగీతం, హీరోయిన్స్ గ్లామర్ సినిమా సక్సెస్‌కు యాడ్ అయ్యాయి. సినిమాలో నటించిన ఇతర నటీనటులకు, టెక్నీషియన్స్‌కు థ్యాంక్స్ చెబుతున్నాను’’ అన్నారు.