6 అ ఇది 8 అ నవదీపా

నవదీప్. హీరోగానే నటిస్తానని కూర్చోకుండా సపోర్టింగ్ రోల్స్‌లోనూ నటిస్తూ వచ్చారు. మధ్య మధ్యలో నెగెటివ్ పాత్రల్లోనూ నటించి మెప్పించారు. ధృవ చిత్రంలో రామ్‌చరణ్ స్నేహితుడిగా కనిపించిన నవదీప్ తర్వాత అంత ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించలేదు. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి అందరికీ తన షాకింగ్ లుక్‌ని రివీల్ చేసి షాకిచ్చారు. అదిరిపోయే కండలతో హాలీవుడ్ హీరోలా ఉన్నారు నవదీప్. అయితే నవదీప్ తన లుక్‌ను ఎందుకిలా న్యూ లుక్ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన నవదీప్ తానిలా మారడానికి తన ట్రైనర్ కృష్ణ సద్వలే కారణమని, బన్నీ, చెర్రీ, రానా తనని ఎంతో ఇన్‌స్ఫైర్ చేశారని కూడా మెసేజ్ ద్వారా పేర్కొన్నారు. అయితే ఇంత చేసిన మరి ఏమైనా అవకాశాలు వస్తాయో రావో చూడాలి మరి.