ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయాలు నాయకలు ప్రజల యొక్క సమస్యల గురించి తప్ప అన్నింటి గురించి చర్చిస్తున్నారు, పోరాడుతున్నారు. ఏపీలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులు వైసీపీ వాళ్ళను ఇబ్బందులకు గురి చేశారు, ఇప్పుడు వైసీపీ నాయకులు కక్షపూరిత రాజకీయాలు చేస్తూ టీడీపీ నాయకులపై, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. అయితే ఇప్పుడు పలాసలో టీడీపీ కార్యకర్త అయిన వినోద్ పై వైసీపీ నాయకులు దాడి చేయడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు.
హింసిస్తున్న వైసీపీ నేతలు
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడనే వంకతో వినోద్ ను అర్ధరాత్రి బలవంతంగా ఎత్తుకెళ్లి భౌతిక దాడి చేయడాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. దీనికి నిరసనగా పలాస పోలీస్ స్టేషన్ వద్ద టిడిపి ఎంపి రామ్మోహన్ నాయుడు బైఠాయిస్తే, బాధితుడిపైనే మళ్లీ ఎదురు తప్పుడు కేసులు బనాయించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. 13 జిల్లాలలో గత 19 నెలల్లో 1,340 చోట్ల టిడిపి కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడటం, 16 మంది కార్యకర్తలను హత్య చేయడం రాష్ట్రంలో నెలకొన్న అరాచక పరిస్థితులకు అద్దం పడుతున్నాయి అని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
కోర్ట్ లు తిడుతున్నా జగన్ మారడా!!
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దాదాపు కోర్ట్ ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. చాలాసార్లు వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కోర్ట్ లు తప్పు పడుతూ తిట్టినా కూడా వైసీపీ నాయకులు మారడం లేదు. టీడీపీ నాయకులపై వైసీపీ నాయకులు వరుసగా దాడులు చేస్తున్నప్పటికీ సీఎం జగన్ రెడ్డి స్పందించపోవడం రాష్ట్ర ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక్కసారి వైసీపీ కార్యకర్తలకు జగన్ ఎందుకు సూచనలు చెయ్యలేకపోతున్నారో ఎవ్వరికి అర్ధం కావడం లేదు. ఇప్పటికే ఇలాంటి విషయాల్లో కోర్ట్ చాలాసార్లు తిట్టినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో మార్పు రావడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు ఈ కక్ష్యపూరిత రాజకీయాలు మాని ప్రజల సమస్యలపై పోరాడే రోజు కోసం ఎప్పుడొస్తుందో!! అసలు రాదేమో….!