Rishab Shetty: తాజాగా ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఛావా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. కాగా ఈ సినిమాలో శంబాజీ మహారాజ్ పాత్రలో పోరాటయోధుడిగా బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ నటించిన విషయం తెలిసిందే. ఈ పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచి ప్రేక్షకులను మెప్పించారు విక్కీ కౌశల్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఆపరేషకులు క్యూ కడుతున్నారు.
దీంతో చత్రపతి శివాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న సినిమాపై ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది. ఇలాంటి సమయంలో తాజాగా ఈ సినిమా గురించి డైరెక్టర్ ఒక ఆసక్తికర అప్డేట్ ను ఇచ్చారు. కోలీవుడ్ స్టార్ హీరో అయిన.రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో ఛత్రపతి శివాజీ జీవిత విశేషాలతో తెరకెక్కుతున్న చిత్రం ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్. సందీప్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఈ సినిమా కోసం వర్క్ చేయనున్న టీమ్ ను ప్రకటించారు. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఇలా అన్ని విభాగాల్లో నిపుణులు ఈ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేయనున్నట్లు తెలిపారు.
ఈ సినిమా లోని రిషబ్ శెట్టి ఫస్ట్ లుక్‌ను ఈ ఏడాది మే నెలలో జరగనున్న ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఒక పోస్ట్ ని కూడా చేశారు డైరెక్టర్. ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్ సినిమాను హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో సందీప్ సింగ్ తెరకెక్కించనున్నారు. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు. అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి, మొఘల్ సామ్రాజ్యాన్ని సవాలు చేసిన ఒక యోధుడి కథ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 2027 జనవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని ఏడు భాషల్లో తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, మరాఠీ, మలయాళం, బెంగాలి ఒకేసారి విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రిషబ్ శెట్టి జై హనుమాన్ సినిమాతో పాటు కాంతార 2 సినిమాలతో బిజీగా ఉన్నారు.