సింగర్ సునీత పెళ్లి వాయిదా !

సింగర్ సునీత ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోయింది. ఈమె త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతుంది. చాలా కాలంగా తనకు తెలిసిన బిజినెస్ మ్యాన్ రామ్ వీరపనేనితో త్వరలోనే ఏడడుగులు వేయబోతుంది సునీత. ఈమె పెళ్లి చేసుకోబోతుందనే విషయం తెలియగానే ఆమె అభిమానులతో పాటు సన్నిహితులు కూడా సోషల్ మీడియాలో సునీతకు కంగ్రాట్స్ తెలిపారు.

Singer Sunitha Condemns Rumors On bigg boss 4 telugu

డిజిటల్ మీడియా ప్రముఖుడు వీరపనేని రామ్‌తో ఈమె నిశ్చితార్థం జరిగింది. కేవలం 19 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్న సునీత.. కొన్నేళ్ల కాపురం తర్వాత విడిపోయింది. ఇద్దరు పిల్లల బాధ్యత తీసుకుంటూ చాలా ఏళ్లుగా ఒంటరిగానే ఉన్న సునీత. తాజాగా మరో కొత్త ప్రయాణం మొదలు పెడుతుంది.

ఈమె పెళ్లిపై ఇప్పుడు మరో వార్త వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు సునీత పెళ్లి డిసెంబర్ 27న హైదరాబాద్‌లోనే జరగనుందని ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం ఫిబ్రవరి 2021కు ఈ పెళ్ళి వాయిదా వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వ్యక్తిగత కారణాలతోనే రెండు కుటుంబాలు కూర్చుని మాట్లాడుకున్న తర్వాత ఈ పెళ్లిని వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది.