ప్రముఖ సినీ చిత్ర గాయని సునీత వివాహంపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టేసింది. గత కొన్ని రోజులుగా ఆమె రెండో పెళ్లిపై వదంతులు వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. ఆ వార్తను నిజం చేస్తూ ఆమె ఈ రోజు ఉదయమే వివాహ నిశ్చితార్థం చేసుకున్నట్లు సమాచారం.
ఈ మేరకు డిజిటల్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న బిజినెస్ మెన్ రామ్ వీరపనేనితో సోమవారం ఉదయం సునీత నిశ్చితార్థం జరిగింది.
ఇక ఆమె వివాహం చేసుకోబోతున్న వ్యక్తికి కూడా ఇది రెండో వివాహం అని తెలుస్తోంది. కరోనా కారణంగా కేవలం రెండు కుటుంబాల పెద్దలు మాత్రమే ఈ ఉదయం శుభకార్యానికి హాజరయ్యారని సమాచారం. . కాగా చిన్న వయసులోనే సింగర్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సునీత చిన్న వయసులోనే పెళ్లి కూడా చేసుకున్నారు. కాగా 19 ఏళ్ల వయసులోనే సునీతకు పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు పుట్టాక.. భర్త తీరుతో విసిగిపోయి విడాకులు తీసుకున్న సునీత పిల్లల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు.
అప్పట్లో రెండో పెళ్లి చేసుకునే ఉద్ధేశ్యం లేదని చెప్పిన ఆమె అనూహ్యంగా ఇలా ఎంగేజ్‌మెంట్ చేసుకోవడంతో అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. ఇక గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు సునీత. పాటల తోటలో పాతికేళ్లుగా అలుపెరగని గాన కోయిల ఆమె.