టాలీవుడ్ సినీ గాయని సునీత పెళ్లి వేడుక కి తేదీ ఖరారైంది. ప్రముఖ డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేనితో సునీత ఏడడుగులు వేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ వివాహానికి జనవరి 9వ తేదీని ముహూర్తంగా ఫిక్స్ చేశారు. కుటుంబ సభ్యుల, సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం జరగబోతోంది.
మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుని రామ్ వీరపనేనితో సునీత రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. కొన్నిరోజుల ముందే హైదరాబాద్‌లో కుటుంబ సభ్యుల, సన్నిహితుల సమక్షంలో రామ్, సునీతల నిశ్చితార్థం జరిగింది. ఇటీవలె వీరిద్దరూ కలిసి సింగర్స్ యూనిట్‌కి గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ రోజు సినీ పరిశ్రమలోని ఇతర సెలబ్రిటీల కోసం ప్రీ వెడ్డింగ్ పార్టీని ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉంటే, సునీతకు 19 ఏళ్ల వయసులోనే పెళ్లి జరిగింది. కిరణ్ కుమార్ గోపరాజును పెళ్లాడారు సునీత. కొన్నేళ్ల కాపురం తర్వాత మనస్పర్థలతో వీరిద్దరూ విడిపోయారు. అప్పటికే వీరికి ఇద్దరు పిల్లలు. వాళ్ల పేర్లు ఆకాష్, శ్రేయ. ఇప్పుడు వాళ్లు పెరిగి పెద్దయ్యారు. తమ తల్లికి ఒక తోడు కావాలని కోరుకున్నారు. అందుకే, 43 ఏళ్ల వయసులో సునీత రెండో పెళ్లికి అంగీకరించారు.