సునీత‌, రామ్ ప్రీ వెడ్డింగ్ పార్టీలో ప్ర‌ముఖుల సంద‌డి..ఫొటోలు వైర‌ల్‌

ఈ ఏడాది టాలీవుడ్‌లో శుభకార్యాలు చాలానే జ‌రిగాయి. పెళ్లిళ్లు, నిశ్చితార్దాల‌తో పాటు బ‌ర్త్ డే వేడుక‌ల వంటివి అట్ట‌హాసంగా జ‌రిగాయి.ఇక ఇప్పుడు సింగ‌ర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత టైం వ‌చ్చింది. 42 ఏళ్ళ వ‌య‌స్సులో బిజినెస్ మ్యాన్ రామ్ వీరపనేనితో ఏడ‌డుగులు వేసేందుకు సునీత సిద్దం కాగా, కొద్ది రోజుల క్రితం వీరి నిశ్చితార్ధం కొద్ది మంది కుటుంబ స‌భ్యుల మ‌ధ్య సాదాసీదాగా జ‌రిగింది. ఇక అనంత‌రం నితిన్ నిర్వహించిన ప్రీ వెడ్డింగ్ పార్టీ లో ఈ జంట‌తో పాటు రేణూదేశాయ్, సుమ త‌దిత‌రులు సందడి చేశారు.

ఇద్దరి జాతకాల ప్ర‌కారం 2020లో ముహూర్తం లేకపోవడంతో జ‌న‌వ‌రి 9న ఈ జంట పెళ్లి చేసుకునేందుకు సిద్ద‌మైంది. కేవలం రెండు కుటుంబాలతో పాటు కొద్ది మంది ప్ర‌ముఖులు మాత్ర‌మే ఈ పెళ్ళికి హాజ‌రు అవుతార‌ని తెలుస్తుంది. అయితే పెళ్ళిని కలయికలా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది సునీత. అందులో పెళ్లి అనే మాట కంటే కూడా దైవత్వమే తనకు కనిపిస్తుందని చెప్పింది. ఇక‌ డిసెంబర్ 26 రాత్రి ఓ ప్రముఖ హోటల్లో సునీత, రామ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇండస్ట్రీలో ఉన్న పలువురు మిత్రులను ఈ వేడుకకు ఆహ్వానించింది సునీత. సురేష్ కొండేటి, రేణూ దేశాయ్ సహా మరికొందరు ఈ వేడుకకు వచ్చారు.

ప్రీ వెడ్డింగ్ పార్టీకి సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా, ఇందులో సునీత చాలా సంతోషంగా క‌నిపిస్తుంది. కాగా, సునీత త‌న 19 ఏళ్ల వ‌య‌స్సులోనే పెళ్ళి పీట‌లెక్కగా పిల్ల‌ల‌ని కన్న కొన్నాళ్ల‌కు ఇద్ద‌రు విడిపోయారు. అప్ప‌టి నుండి సునీత త‌న పిల్ల‌ల‌ని అన్నీ తానై చూసుకుంది. మంచి ప్ర‌యోజ‌కుల‌ని చేసింది. ఇక ఇప్పుడు త‌న‌కు తోడు కావాల‌ని భావించి రామ్‌తో ఏడ‌డుగులు వేసేందుకు సిద్ద‌మైంది.