అప్పుడే ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ మొద‌లు పెట్టిన సింగ‌ర్ సునీత.. ఊహించ‌ని అతిథులు రావ‌డంతో సంద‌డిగా మారిన ప్రాంగ‌ణం

ఈ ఏడాది ముగుస్తున్నప్ప‌టికీ, టాలీవుడ్‌లో పెళ్లిళ్ల సంద‌డి ఆగ‌డం లేదు. రీసెంట్‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్‌, నిహారిక‌లు పెళ్లి పీట‌లెక్క‌గా మ‌రి కొద్ది రోజుల‌లో సింగర్ సునీత డిజిట‌ల్ మీడియా రంగానికి చెందిన రామ్‌తో ఏడ‌డుగులు వేయ‌నుంది. 42 ఏళ్ళ వ‌య‌స్సులో ఈమె రెండో పెళ్ళి చేసుకోనుండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గ‌తంలో రెండో పెళ్ళి అనే ఊసే త‌న ద‌గ్గ‌ర తీసుకురావ‌ద్ద‌ని చెప్పిన సునీత ప‌రిస్థితుల ప్ర‌భావం వ‌ల‌న ఈ పెళ్ళి చేసుకున్నాన‌ని అంటుంది. డిసెంబ‌ర్ 26న సునీత‌-రామ్‌ల పెళ్ళి ఘ‌నంగా జ‌ర‌గ‌నుండ‌గా, రీసెంట్‌గా ప్రీ వెడ్డింగ్ వేడుక నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ఇండ‌స్ట్రీకి సంబంధించి ప‌లువురు ప్ర‌ముఖుల‌ని ఆహ్వానించింది సునీత‌.

డిసెంబర్ 19 రాత్రి ఓ ప్రముఖ హోటల్ లో సునీత, రామ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఊహించ‌ని అతిథులు ఈ వేడుక‌కు రావ‌డంతో ఫొటోలు వైర‌ల్‌గా మారాయి. ప‌వ‌న్ క‌ళ్యాన్ మాజీ భార్య రేణూ దేశాయ్, సీనియ‌ర్ యాంక‌ర్ సుమ‌,అలాగే ప‌లువురు మ్యాజిక్ డైరెక్ట‌ర్స్ , సింగ‌ర్స్ కూడా ఈ వేడుక‌లో క‌నిపించారు. ప్ర‌స్తుతం ప్రీ వెడ్డింగ్ ఫోటోలో సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. అయితే కొన్ని ఫొటోల‌ని గ‌మనిస్తే ప్రీ వెడ్డింగ్ వేడుక‌లో రామ్..సునీత‌తో క‌లిసి పాట పాడిన‌ట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే కొన్ని రోజుల కింద రామ్ తో సునీత నిశ్చితార్థం జరిగింది.కేవ‌లం కుటుంబ స‌భ్యుల మ‌ధ్య ఎలాంటి హ‌డావిడి లేకుండా ఈ వేడుక నిర్వ‌హించారు

డిసెంబ‌ర్ 26న జ‌ర‌గ‌నున్న పెళ్ళి వేడుక‌కి కేవ‌లం కుటుంబ స‌భ్యుల‌ని మాత్ర‌మే ఆహ్వానించ‌నున్నార‌ట‌. దీనిని పెళ్లిలా తాము భావించ‌డం లేద‌ని, రెండు కుటుంబాల క‌ల‌యిక‌గా భావిస్తున్నామంటూ చెప్పుకొచ్చింది సునీత. ఇందులో పెళ్లి అనే మాట కంటే కూడా దైవత్వమే తనకు కనిపిస్తుందని చెప్పింది. కాగా, సునీతకు 19 ఏళ్ళ వ‌య‌స్సులోనే వివాహం జ‌రిగింది. ప‌లు కార‌ణాల వ‌ల‌న ఇద్ద‌రు విడాకులు తీసుకోవ‌డంతో పిల్ల‌ల‌ని సునీత‌నే పెంచి పోషించింది . ఇన్ని రోజుల త‌ర్వాత త‌న‌కు ఓ బంధం కావాల‌నుకున్న సునీత మరి కొద్ది రోజుల‌లో రామ్‌తో ఏడ‌డుగులు వేయ‌నుంది.