డ్రంక్ అండ్ డ్రైవ్ : లోబో, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ హల్చల్ (వీడియో)

సింగర్ రాహుల్ సిప్లిగంజ్, ఆర్టిస్టు లోబోలు ఇద్దరు తప్పతాగి పోలీసులకు చుక్కలు చూపించారు. మద్యం తాగి వాహనం నడుపుతూ జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులకు వారు పట్టుబడ్డారు. రాహుల్ సిప్లిగంజ్ తాగడమే కాకుండా లైసెన్సు లేకుండా కారు నడిపాడు. తాము ఆర్టిస్టులమంటూ కాసేపు పోలీసులతో వారు వాగ్వాదానికి దిగి ముప్పుతిప్పలు పెట్టారు. పోలీసులు కూడా అంతే రీతిలో సమాధానం ఇచ్చారు. గతంలో లోబో వరంగల్ జిల్లాలో కారు ప్రమాదం చేశాడు. ఈ ప్రమాదంలో అమాయకులైన కూలీలు చనిపోయారు. లోబో అప్పుడు కూడా తాగి కారు నడిపాడన్న ఆరోపణలు ఉన్నాయి. తాగుబోతులతో పోలీసులకు డ్రంకైన్ డ్రైవ్ సవాల్ గా మారుతుంది. అర్ధరాత్రి లోబో, రాహుల్ పోలీసుల్ని ఎట్లా సతాయించారో కింద వీడియోలు ఉన్నాయి చూడండి

[videopress U7e5Hclo]

[videopress zIFXVi51]